Bigg Boss Telugu 3: బిగ్ బాస్ 3 విన్నర్‌పై నాగార్జున సంచలన ట్వీట్, సోషల్ మీడియా వార్తలను నమ్మవద్దు, విజేత ఎవరనేది సాయంత్రం తెలుస్తుంది, ఆ ట్వీట్ వెనుక రహస్యం ఏంటీ ?
akkineni nagarjuna-says-do-not-believe-bigg-boss-scrolls-social-media I Photo- Star Maa Telugu

November 3:బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 విజేత ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. అయితే బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గురించి గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు బిగ్‌బాస్‌ ఫైనల్లో ఐదుగురు సభ్యులు నిలువగా వారిలో శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నట్టుగా తెలుస్తోంది.  అయితే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 టైటిల్‌ రాహుల్‌ సొంతం చేసుకుంటాడని సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. మరోవైపు బిగ్‌బాస్‌ విజేతగా శ్రీముఖి నిలుస్తోందని ఆమె అభిమానులు నమ్మకంతో ఉన్నారు.  తెలుగు బిగ్ బాస్ 3 విజేత ఎవరు? 

ఇలాంటి సమయంలో బిగ్ బాస్ 3 హోస్ట్ నాగార్జున రంగంలోకి దిగాడు. రూమర్స్‌ అన్నింటికి ఒకే ట్వీట్‌తో ఫుల్ స్టాప్ పెట్టేసాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్ధమని, వాటిని నమ్మవద్దని కొట్టి పారేసాడు. అసలు విజేత ఎవరో తాను చెప్తానని.. అది కూడా బిగ్ బాస్ లైవ్ స్ట్రీమింగ్ అంటూ సంచలనం రేపాడు. దాంతో ఒక్కసారిగా సీన్ అంతా తలకిందులు అయిపోయింది.

నాగార్జున ట్వీట్

దీంతో పాటు బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 ఒక అద్భుతమైన ప్రయాణమని చెప్పారు. బిగ్‌బాస్‌ విన్నర్‌పై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని, విజేత ఎవరనేది సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమం చూసి తెలుసుకోవాలని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు.

అయితే ఈ సారి రాహుల్‌ టైటిల్‌ సొంతం చేసుకుంటాడని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.లీక్‌లు నెటిజన‍్ల వాదనకు బలాన్ని ఇచ్చేలా ఉన్నాయి. శ్రీముఖి మీద కొద్దిపాటి ఓట్ల మెజారిటీతో రాహుల్‌ మొదటి స్థానంలో నిలిచాడనే ప్రచారం జరుగుతోంది. అయితే వీటిని నాగార్జున కొట్టిపారేశారు. మొత్తానికి పుకార్లు ఎలా ఉన్నా ఈ సారి విజేత చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ అందుకోబోతున్నాడు.