
Hyderabad, Aug 8: టాలీవుడ్ (Tollywood) ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్ టైన్స్ మెంట్ ప్రొడక్షన్స్ అధినేత శ్యామ్ ప్రసాద్‌రెడ్డి (Shyam Prasad Reddy) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సతీమణి వరలక్ష్మి కన్నుమూశారు. గతకొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె బుధవారం రాత్రి మరణించారు. వరలక్ష్మి మృతిపట్ల తెలుగు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా, దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తెనే ఈ వరలక్ష్మి.
మీ స్ఫూర్తి మాలో ప్రతి ఒక్కరిలో ప్రకాశిస్తుంది, వినేశ్ ఫొగాట్‌కు ధైర్యం చెప్పిన మహేశ్ బాబు
ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య మృతిhttps://t.co/VvaHh1n6c0#tfpc pic.twitter.com/otMBXKllSj
— Telugu Film Producers Council (@tfpcin) August 8, 2024
భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ గా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గుర్తింపు పొందారు. అమ్మోరు, అంజి, అరుంధతి, తలంబ్రాలు, ఆహుతి, అంకుశం వంటి హిట్ సినిమాలను రూపొందించారు. ప్రస్తుతం సినిమాల నిర్మాణానికి దూరంగా ఉంటున్న ఆయన.. సీరియల్స్ తో పాటు జబర్దస్త్, ఢీ వంటి పలు రియాలిటీ షోలను నిర్మిస్తున్నారు.