National Film Awards: 69 ఏళ్లుగా ఊరిస్తున్న అవార్డును తగ్గేదే లే అంటూ పట్టేసుకున్న అల్లు అర్జున్, పుష్ప చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు
Pushpa (Photo-Video Grab)

కేంద్ర ప్రభుత్వం 2021కి గాను జాతీయ చలన చిత్ర పురస్కారాల (69th National Film Awards)ను ప్రకటించింది. పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ జాతీయ అవార్డు అందుకున్నాడు. 69 ఏళ్లలో ఇప్పటివరకు తెలుగు హీరోలెవరూ సాధించని అరుదైన రికార్డును నెలకొల్పి.. మరోసారి టాలీవుడ్‌ను టాక్ ఆఫ్‌ ది గ్లోబల్ ఇండస్ట్రీగా మార్చేశాడు బన్ని (Allu Arjun). 2021 గాను కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ నేషనల్ అవార్డులు ప్రకటిస్తూ.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పేరుని అనౌన్స్ చేసింది. ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్ ఈఅవార్డుతో పాటు అల్లు అర్జున్ రూ.50 వేల ప్రోత్సాహక నగదును కూడా అందుకోనున్నారు.

2021లో ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన పుష్ప.. ది రైజ్‌ (Pushpa: The Rise)లో పుష్పరాజ్‌గా వరల్డ్‌వైడ్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. పుష్ప.. తగ్గేదే లే అంటూ గ్లోబల్‌ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఈ చిత్రంతో ఐకాన్‌ స్టార్‌గా పేరు మార్చేసుకుని.. ఇప్పుడు పుష్ప.. ది రూల్‌ అంటూ మరోసారి దండయాత్ర చేసేందుకు వస్తున్నాడు.

జాతీయ స్థాయి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా అలియా భట్‌, కృతిసనన్‌, 69వ జాతీయ అవార్డుల పూర్తి వివరాలు ఇవిగో..

కుమారుడికి అవార్డు రావడంపై అల్లు అరవింద్ స్పందిస్తూ.. ప్రశ్నలు, సమాధానాలు లేవు.. 69 ఏళ్లుగా తెలుగు పరిశ్రమకు రాని ఒక అద్భుతాన్ని తీసుకువచ్చిన ఈ తెలుగు ప్రేక్షకులకు, సినిమా తీసిన నిర్మాతలకు, దర్శకులకు, ఇతర సినిమా బృందానికి, మా ఫ్యామిలీని పతాకస్థాయికి తీసుకువెళ్లిన మా అబ్బాయికి కృతజ్ఞతలు అన్నారు.