Credits: AA Fans FB Page

Hyderabad, Nov 12: టాలీవుడ్ (Tollywood) ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) దాతృత్వంలోనూ ముందుంటారు. ఎవరైనా సాయం (Help) కోరితే కాదనలేరు. ఇక తన వద్ద పనిచేసే సిబ్బందికి (Workers) ఆయన అన్నివిధాలా అండదండలు అందిస్తారు. ఆ విషయం మరోసారి నిరూపితమైంది. అల్లు అర్జున్ వద్ద బోరబండ వాసి మహిపాల్ గత పదేళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మహిపాల్ స్వస్థలం వరంగల్. నమ్మకంగా ఉండడంతో అల్లు అర్జున్ అతడ్ని తన వ్యక్తిగత డ్రైవర్ గా కొనసాగిస్తున్నారు.

మీద నుంచి ట్రైన్ వెళ్లినా కూడా బతికి బయటపడ్డాడు, అడ్డదిడ్డంగా పట్టాలు దాటుతున్న వాళ్లు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది!

కాగా, మహిపాల్ బోరబండలో సొంత ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ తన డ్రైవర్ కు రూ.15 లక్షలు అందించారు. మహిపాల్ కుటుంబ సభ్యులను కలిసి ఈ మేరకు ఆర్థికసాయం అందించి వారిని సంతోషంలో ముంచెత్తారు. దీనికి సంబందించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.