మలయాళ చిత్ర పరిశ్రమలో విషాద సంఘటన చోటుచేసుకుంది. నటుడు అనిల్ మురళి(56) (Anil Murali Passes Away at 56) కన్నుమూశారు. అనారోగ్య కారణంతో కొచ్చిలో నేడు ఆయన తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నఅనిల్ మురళి కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మరణించారు. అనిల్ మురళి మరణం మలయాళ పరిశ్రమకు తీరని లోటని నటులు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), తోవినో థామస్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని ప్రకటించారు. అనిల్ మురళికి భార్య సుమ, పిల్లలు ఆదిత్యా, అరుంధతి ఉన్నారు.
1993లో ‘కన్యాకుమారియిల్ ఒరు కవిత’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనిల్ మురళీ (Anil Murali) దక్షిణాది భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. తెలుగులో నాని హీట్ సినిమా ‘జెండాపై కపిరాజు’, ’రంగేలీ కాశీ’లో నటించిన ఆయనకు తమిళంలో నటించిన ‘అవతారం’, ‘రాక్ అండ్ రోల్’, ‘బాడీగార్డ్’, ‘సిటీ ఆఫ్ గాడ్’, ‘బ్రదర్స్ డే’ చిత్రాల్లోని పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
Prithviraj Sukumaran Mourns The Demise Of Anil Murali :
Rest in peace Anil Etta. #AnilMurali 🙏 pic.twitter.com/nbCiPr09bD
— Prithviraj Sukumaran (@PrithviOfficial) July 30, 2020
ఈ మధ్యకాలంలో ఎక్కువగా సీరియళ్లలో నటిస్తున్నారు. ‘ఆహా’ డిజిటల్ డయాస్ మీద శుక్రవారం విడుదలవుతోన్న ‘ఫొరోన్సిక్’ చిత్రం నటుడిగా ఆయనకు ఆఖరి చిత్రం. దిలీప్, నమితా ప్రమోద్ నటించే ‘డింకిన్’ అనే చిత్రం ఇంకా సెట్స్ మీద ఉండగా.. ఈ చిత్రం కోసం ఆయన కొన్ని రోజులు పనిచేశారు. మలయాళం, తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమలలో 150 కి పైగా చిత్రాల్లో నటించారు.