Hyderabad, June 23: డ్రగ్స్ కేసులో అరెస్టయిన సినీ నిర్మాత కేపీ చౌదరి (KP Choudary) కస్టడీ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెలబ్రెటీలు, నేతల కుమారులకు కేపీ చౌదరి డ్రగ్స్ విక్రయించారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అతన్ని విచారించారు. కేపీ చౌదరి కాల్ లిస్ట్‌ను (Kp Chaudhary Call List) డీకోడ్ చేసిన పోలీసులు బిగ్‌బాస్ కంటెస్టెంట్ అషురెడ్డితో (Ashu Reddy) పాటు తెలుగు సినిమాల్లో పలు ఐటెం సాంగ్స్ చేసిన ఓ నటితో వందలాది కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు.
అయితే ఈ కాల్స్‌పై కేపీ చౌదరి నోరు మెదకపోవడం గమనార్హం. అలాగే 12 మందికి డ్రగ్స్ (Drugs) సరఫరా చేసినట్లుగా కేపీ చౌదరి ఒప్పుకున్నాడు. వీరిలో కొంతమంది పేర్లను మాత్రమే అతను బయటపెట్టాడు. రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, బెజవాడ భరత్, శ్వేత, ఠాగోర్ ప్రసాద్‌కు డ్రగ్స్ అమ్మినట్లు తెలిపాడు.
కేపీ చౌదరి కేసులో ఫోన్‌కాల్స్, బ్యాంక్ లావాదేవీలు కీలకంగా మారాయి. అతని కాల్ డేటాను డీకోడ్ చేయడంతో పాటు పలువురికి బ్యాంక్ ద్వారా చెల్లింపులు చేసినట్లుగా నిర్ధారించారు. వీటిలో 11 అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిన పోలీసులు.. వాటిని ఎందుకు జరిపారన్న దానిపై దర్యాప్తు చేపట్టారు.