Singh Rajput Death Case: సుశాంత్ కేసుకు రాజకీయ రంగు, బీహార్ రాష్ట్ర పోలీసు అధికారి వినయ్ తివారీని క్వారంటైన్‌కి తరలించిన ముంబై పోలీసులు, ఖండించిన సీఎం నితీష్ కుమార్
Bihar Chief Minister Nitish Kumar | (Photo Credits: ANI/File)

Patna, August 4: బాలీవుడ్‌ యంగ్‌హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య (Singh Rajput Death Case) ఉదంతం రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. ఈ కేసు విషయంపై మహారాష్ట్ర, బిహార్‌ ప్రభుత్వాల (Maharashtra vs Bihar Govt) మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు దర్యాప్తు కోసం పాట్నా నుంచి ముంబై వెళ్లిన తమ రాష్ట్ర పోలీసు అధికారి వినయ్ తివారీని అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బలవంతంగా క్వారంటైన్ కి తరలించడాన్ని బీహార్ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ ఖండించారు. నిజాలు బయటకు రావాల్సిందే, సుశాంత్ ఆత్మహత్య కేసులో న్యాయం చేయాలని సోద‌రి శ్వేతా కీర్తిసింగ్ డిమాండ్, సుశాంత్‌ మృతిపై పోలీసులను ఆశ్రయించిన తండ్రి కెకె సింగ్

ఏది ఏమైనా ఇది తప్పు.. మా వాళ్ళు కేసు దర్యాప్తు కోసం వెళ్తే బలవంతంగా క్వారంటైన్ కి తరలిస్తారా’ అని ఆయన (Bihar CM Nitish Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా-ముంబై అధికారుల చర్య సిగ్గుచేటని బిహార్ మంత్రి సంజయ్ ఝా ఆరోపించారు. దీనిపై మా రాష్ట్ర పోలీసులు ఏదో ఒక చర్య తీసుకుంటారని అన్నారు. అయితే తమ చర్యను ముంబై సిబ్బంది సమర్థించుకున్నారు.

మీడియా దీన్ని ‘మిస్ రిప్రెజెంట్’ చేసిందని భగ్గుమంటూనే వినయ్ తివారీ డొమెస్టిక్ ఎయిర్ ట్రావెలర్ గా వచ్చారని, తమ రాష్ట్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఆయనను క్వారంటైన్ కి తరలించవలసిందేనని వారన్నారు. అయితే క్వారంటైన్ కాల పరిమితి నుంచి తనను మినహాయించాలని తివారీ తమ కార్పొరేషన్ అధికారులను కోరవచ్ఛునన్నారు.

Bihar DGP Will Speak With Authorities There, Says Bihar CM Nkumar:

నిబంధనలు పేరుతో ఆయనను 14 రోజుల పాటు క్వారంటైన్ కు తివారీని తరలించారు. సుశాంత్ కేసు దర్యాప్తు బృందానికి నాయకత్వం వహిస్తున్న ఐపీస్ అధికారి వినయ్ తివారీనీ బీఎంసీ అధికారులు ఆదివారం రాత్రి బలవంతంగా క్వారంటైన్ చేశారంటూ బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ట్వీట్ చేశారు. తివారీకి వసతి కల్పించాలని తాము కోరినా, అతని చేతికి క్వారంటైన్ స్టాంపు వేసి క్వారంటైన్ చేశారని డీజీపీ ఆరోపించారు.

Here's Bihar DGP IPS Gupteshwar Pandey Tweet

మా రాష్ట్ర పోలీసులు తమ విధుల్లో భాగంగానే ముంబై వెళ్లారని, ఇందులో రాజకీయానికి తావు లేదని ఆయన అన్నారు. ముంబై అధికారుల చర్యపై తమ రాష్ట్ర డీజీపీ మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడతారని నితీష్ కుమార్ అన్నారు. కేసు విచారణ నిమిత్తం బిహార్‌ పోలీసులు ముంబైకి రావడం, అక్కడ ముంబై పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కిపంపించడం కూడా వివాదానికి దారితీసింది.

సుశాంత్‌ ఆత్మహత్య కేసులో (Sushant Singh Rajput suicide case) నిజాలు బయటపడకుండా బాలీవుడ్‌ మాఫీయా అడ్డుపడుతోందని, చిత్రపరిశ్రమలోని కొందరి ఒత్తడికి ఉద్ధవ్‌ ఠాక్రే తలొంచారని బిహార్‌ ఉపముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత సుశిల్‌ మోదీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్‌ దోషులను కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

తాజా కేసును విచారించే శక్తీ, సామర్థ్యాలు బిహార్‌ పోలీసులకు ఉన్నాయని, వారి విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని, కానీ ముంబై పోలీసుల నుంచి సరైన సహకారం లేదని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం రాత్రి ఓ మీడియాతో మాట్లాడిన సుశిల్‌ మోదీ.. మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సుశాంత్‌ కేసును సీబీఐకి చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు.

కాగా సుశాంత్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తితోపాటు ఆమె కుటుంబసభ్యుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ కేసు నమోదు చేశారు. దీంతో రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అలాగే ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య కోల్డ్ వార్ కి దారితీసింది. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న ముంబై పోలీసులు ఇప్పటివరకు రియా చక్రవర్తితోపాటు దాదాపు 40 మంది వాంగ్మూలాలను రికార్డు చేశారు. ముఖ్యంగా రాజ్‌పుత్ కుటుంబ సభ్యులు, అతని కుక్, చిత్రనిర్మాత మహేష్ భట్, సినీ విమర్శకుడు రాజీవ్ మసంద్, దర్శకుడు, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ, నిర్మాత ఆదిత్య చోప్రా ఉన్నారు.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇప్పటికే కేసు నమోదు చేసింది. సుశాంత్‌ బ్యాంక్‌ ఖాతాలను పరిశీలించిన ఈడీ అధికారులు మనీ లాండరింగ్‌ ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బిహార్ పోలీసుల నివేదిక ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి బిహార్ పోలీసు బృందం జరిపిన దర్యాప్తుపై పట్నాలోని బిహార్ డీజీపీ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ ఖాతానుంచి సుమారు 15 కోట్ల రూపాయలను నటి రియా చక్రవర్తి వాడుకుందని సుశాంత్‌ తండ్రి ఫిర్యాదు నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

భారీ మొత్తంలో సుశాంత్ డ‌బ్బును అక్ర‌మ రీతిలో వాడుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్‌ విచారించాలని మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్నవీస్ ఇప్పటికే కోరారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఇసీఐఆర్) ను నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

Here's Devendra Fadnavis Tweet

బిహార్‌, బీజేపీ నేతల తీరుపై సీఎం ఠాక్రే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తును నిర్వహించడంలో ముంబై పోలీసుల సామర్థ్యాన్ని ప్రశ్నించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. ముంబై పోలీసుల విశ్వసనీయత దెబ్బతీస్తున్న బీజేపీ నేతల తీరు సరైనది కాదని మండిపడ్డారు. కేసును విచారించి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని ఠాక్రే స్పష్టం చేశారు. జూన్‌ 14న సబర్బన్‌ బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు రాజ్‌పుత్ కుటుంబం, అతని కుక్‌తో సహా సుమారు 40 మంది వాంగ్మూలాలను నమోదు చేసింది.