Kannappa release date

Hyd, July 19: మంచు ఫ్యామిలీ భారీ బడ్జెట్‌తో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న మంచు ఫ్యామిలీ హీరోలకు ఈ సినిమా చాలా కీలకం కానుంది. సన్ ఆఫ్ ఇండియాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మోహన్ బాబు భారీ డిజాస్టర్‌ను మూటగట్టుకున్నారు. అలాగే మంచు లక్ష్మీ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడటం లేదు. ఇక మంచు మనోజ్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు.

అయితే ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఉన్న విష్ణు..తానే ప్రధానపాత్రలో కన్నప్ప అనే పాన్ ఇండియన్ సినిమాతో వస్తున్నారు. ప్రభాస్,అక్షయ్ కుమార్,మోహన్ లాల్,శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్ర పోషిస్తుండగా తాజాగా రిలీజ్ డేట్‌ని ఖరారు చేశారు విష్ణు.

ఈ మేరకు విష్ణు చేసిన ట్వీట్ వైరల్‌గా మారగా అవా ఎంటర్‌టైన్మెంట్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. టెలివిజన్ రామయాణాన్ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తుండగా విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బడ్జెట్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా విజువల్ వండర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు విష్ణు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి. ఇక ఇదే డిసెంబర్‌లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌, పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు కూడా రిలీజ్ కానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఫైట్ తప్పేలా కనిపించడం లేదు. బుక్ మై షోలో క‌ల్కి మూవీ సంచ‌ల‌నం, దేశ‌వ్యాప్తంగా ఏకంగా కోటీ 21 ల‌క్ష‌ల‌కు పైగా టికెట్లు సేల్, తెలుగు రాష్ట్రాల్లో ఎవ‌రికీ సాధ్యం కాని రికార్డు సొంతం

ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ ఉండగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న తొలిచిత్రం హరిహర వీరమల్లు కానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా సందడి ఉండనుంది. అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ - శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ వస్తుండగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా సినిమాలే కావడంతో డిసెంబర్ లో సినీ అభిమానులకు ఖచ్చితంగా పండే కానుంది.