Chiyaan Vikram Health: తమిళ స్టార్ హీరో విక్ర‌మ్‌కు గుండెపోటు, ఐసీయూలో చికిత్స అందిస్తున్న వైద్యులు, ఇటీవలే కరోనా బారీన పడిన విక్రమ్
Vikram (Photo-Instagram)

తమిళ స్టార్ హీరో విక్ర‌మ్ గుండెపోటుకు గుర‌య్యారని వార్తలు వస్తున్నాయి. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న ఉన్న‌ట్టుండి గుండెపోటుకు గుర‌యినట్లుగా తెలుస్తోంది. అయితే వెనువెంట‌నే స్పందించిన ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌ను చెన్నైలోని కావేరీ ఆసుప‌త్రికి త‌ర‌లించారని సమాచారం. ప్రస్తుతం ఆయ‌న కావేరీ ఆసుప‌త్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. విక్రమ్‌కు ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తమిళ మీడియా పేర్కొంది. సినీ పరిశ్రమను వెంటాడుతున్న మరణాలు, గౌతమ్‌ రాజు మృతి మరవక ముందే ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్‌ కన్నుమూత

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే క‌రోనా బారిన ప‌డిన విక్ర‌మ్ దాని నుంచి పూర్తిగా కోలుకున్న సంగ‌తి తెలిసిందే. స్టార్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం రూపొందిస్తున్న పొన్నియ‌న్ సెల్వ‌న్ చిత్రంలో విక్ర‌మ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం శుక్ర‌వారం సాయంత్రం చెన్నైలో జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి విక్ర‌మ్ కూడా హాజ‌రు కావాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన ‘కోబ్రా’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.