తెలుగు సినీ పరిశ్రమలో వరుస మరణాలు కలవరపరుస్తున్నాయి. నిన్న ఫిలిం ఎడిటర్‌ గౌతమ్‌ రాజు హఠాన్మరణం మరువకముందే ప్రముఖ చలన చిత్ర నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్‌(86) మృతిచెందారు. నిర్మాత రాజేంద్ర ప్రసాద్‌ మృతితో టాలీవుడ్‌ సినీ పరిశ్రమ మరోసారి విషాదంలోకి వెళ్లింది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో నిర్మాత మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ ఆయన ఆత్మకు చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కాగా మాధవి పిక్చర్స్‌ బ్యానర్లో దొరబాబు, సుపుత్రుడు, కురుక్షేత్రం, ఆటగాడు వంటి తదితర చిత్రాలను నిర్మించారు ఆయన. అంతేకాదు ప్రముఖ దివంగ నిర్మాత రామానాయడుతో కలిసి పలు చిత్రాలకు సహా నిర్మాతగా గోరంట్ల రాజేంద్ర ప్రసాద్‌ వ్యవహరించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)