Dharmendra (Photo Credit: @aapkadharam/Instagram)

ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో హృదయపూర్వక నివాళి అర్పించారు. భారతీయ సినిమాకు ధర్మేంద్ర చేసిన అసాధారణ సేవలను గుర్తుచేసుకుంటూ, “ధర్మేంద్ర జీ మృతి ఒక యుగం ముగింపు. ఆయన ప్రతి పాత్రకు ప్రత్యేకమైన ఆకర్షణ, లోతు ఇచ్చిన గొప్ప నటుడు. ఆయన వినయం, సరళత, ఆప్యాయత అందరినీ ఆకట్టుకున్నాయి.

ధైరాయిడ్ క్యాన్సర్‌తో పోరాడి మృతి చెందిన కేజీఎఫ్‌ మూవీ నటుడు, చికిత్స చేయించుకోవడానికి రూ.70 లక్షలు ఖర్చు..చూస్తుండగానే క్యాన్సర్‌ ముదిరి నాలుగో స్టేజీకి..

ఈ కష్టకాలంలో ఆయన కుటుంబం, స్నేహితులు, అభిమానులకు నా సానుభూతి. ఓం శాంతి,” అని మోదీ పేర్కొన్నారు. 1935లో పంజాబ్‌లోని లూథియానాలో జన్మించిన ధర్మేంద్ర, 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే చిత్రంతో సినీ ప్రవేశం చేశారు. తర్వాత బందిని, ఫూల్ ఔర్ పత్తర్, షోలే, చుప్కే చుప్కే, సీతా ఔర్ గీతా, యాదోన్ కీ బరాత్ వంటి అనేక క్లాసిక్ చిత్రాలతో బాలీవుడ్‌లో అగ్రనటుడిగా ఎదిగారు. ఆయన నటన శైలి, బహుముఖ ప్రతిభ ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోయాయి.

PM Narendra Modi Pays Tribute to Legendary Actor

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) ముంబైలోని తన నివాసంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బందిపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ధర్మేంద్ర చికిత్స పొందుతుండగా తన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ఇంటి వద్దే వ్యైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. అయితే, పరిస్థితి విషమించడంతో తిరిగి రాని లోకాలకు తరలివెళ్లారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. యాక్షన్‌ కింగ్‌గా, బాలీవుడ్‌ హీ మ్యాన్‌గా గుర్తింపు దక్కించుకున్నారు.