Kalki 2898 AD (photo-Twitter)

Bombay, DEC 29: నాగ్ అశ్విన్(Nag Ashwin) ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా ‘కల్కి 2898AD’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమల్‌ హాసన్‌ (Kamal Hassan), దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉందని సమాచారం. ఇప్పటికే ‘కల్కి 2898AD’ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. హిందూ మైథలాజి కథతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సంక్రాంతికే సినిమా రిలీజ్ ప్రకటించినా షూటింగ్ అవ్వకపోవడంతో సినిమా వాయిదా పడింది. తాజాగా కల్కి సినిమా ట్రైలర్ అప్డేట్ చెప్పారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. బాంబే ఐఐటిలో జరుగుతున్న కాలేజీ ఫెస్ట్‌ లో దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొన్నారు. అక్కడ టెక్నికల్ స్టూడెంట్స్ తో అయన ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

 

ఈ క్రమంలో ఓ స్టూడెంట్ ‘కల్కి 2898AD’ సినిమా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడగ్గా నాగ్ అశ్విన్ దీనికి.. 93 రోజుల తర్వాత రిలీజ్ అవ్వొచ్చేమో అని సమాధానమిచ్చారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ లెక్కలేసుకుంటున్నారు. నాగ్ అశ్విన్ చెప్పిన దాని ప్రకారం లెక్కేసుకుంటే 93 రోజుల తర్వాత ఏప్రిల్ 1 వస్తుంది. మరి ఆ రోజే రిలీజ్ చేస్తారా? లేక ఏప్రిల్ 1 అని ఏప్రిల్ ఫూల్ చేస్తారా చూడాలి. కల్కి సినిమా 2024 సమ్మర్ లోనే రిలీజ్ అవుతుందని టాక్ నడుస్తుంది. ఇక ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టాడు. ఇప్పటికే సలార్ సినిమా 500 కోట్లు కలెక్ట్ చేసింది. సంక్రాంతికి డైరెక్టర్ మారుతి సినిమా అప్డేట్ కూడా ఇవ్వబోతున్నాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.