జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్). భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తొలి పాట (RRR First Song Released) విడుదలయింది. ఆర్‌ఆర్‌ఆర్ నుంచి తొలి పాటను 'ఫ్రెండ్‌షిప్ డే' సందర్భంగా ఆగస్ట్1న ఉయయం 11గంటలకు విడుదల చేశారు. ఎం.ఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో ‘దోస్తీ’ అంటూ సాగే ఈ థీమ్ సాంగ్ చివర్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కనిపించారు.
ఊహించని చిత్ర విచిత్రం..స్నేహానికి చాచిన హస్తం..ప్రాణానికి ప్రాణం ఇస్తుందో, తీస్తుందో'...అంటూ సాగిన ఈ సాంగ్ చివర్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం హైలైట్‌గా నిలిచింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించగా, ఎం.ఎం. సంగీతం సంగీతం అందించారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుండటంతో ఒక్కో భాషలో ఒక్కో సింగర్‌తో ఈ పాటని పాడించారు.
పులికి వీలుగాడికి.. తలకి ఉరితాడుకి.. కదిలే కార్చిచ్చుకి.. కసిరే బడగళ్లకి.. రవికి మేఘానికీ.... ‘దోస్తీ’ ఊహించని చిత్రమే చిత్రం.. స్నేహానికి చాచిన హస్తం.. ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో.. ’ అంటూ సాగే ఈ పాట ‘ఆర్‌ఆర్‌ఆర్’లో తారక్, చరణ్‌ల మధ్య దోస్తీని ప్రతిబింబించేలా ఉంది.
కీరవాణి సారథ్యంలో హేమచంద్ర (తెలుగు), అమిత్ త్రివేది (హిందీ), అనిరుధ్ (తమిళం), యాసిన్ నజీర్ (కన్నడ), విజయ్ జేసుదాస్ (మలయాళం).. ఇలా ఐదు భాషలకు చెందిన ఐదుగురు సంగీత యువ కెరటాలు ఈ పాటను హుషారెత్తించేలా ఆలపించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో రామ్‌చరణ్-తారక్‌ల స్నేహానికి ప్రతీకగా ఈ పాటను రూపొందించినట్లు అర్థమవుతోంది.
Here's rajamouli ss Tweet
This Friendship day, witness the coming together of 2 powerful opposing forces - Ramaraju🔥& Bheem 🌊#Dosti Music Video: https://t.co/uK5ltoe7Fq@MMKeeravaani@itsvedhem @anirudhofficial @ItsAmitTrivedi @IAMVIJAYYESUDAS #YazinNizar@TSeries @LahariMusic #RRRMovie #Natpu #Priyam
— rajamouli ss (@ssrajamouli) August 1, 2021
ఇక ఈ సాంగ్ పాడిన ఐదుగురు సింగర్స్ ఈ వీడియో సాంగ్‌లో కనిపించి సందడి చేశారు. ఈ పాట కోసం దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలతో సెట్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి.. ఇక ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఒలివియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది.
ఆర్ఆర్ఆర్’ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురంభీమ్‌గా తారక్ కనిపించనున్నారు. ఆలియాభట్, ఒలీవియా మోరీస్, రేయ్ స్టీవ్‌సన్, ఆలిసన్ డ్యూడీ, శ్రియ, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖనిలతోపాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. అక్టోబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రమోషన్స్‌లో భాగంగా ‘దోస్తీ’ పాటను విడుదల చేశారు. మరోవైపు ఇటీవల విడుదల చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ మేకింగ్ వీడియోతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.