
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ లైగర్ సినిమా లావాదేవీల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గుర్తించింది.ఈ సినిమాలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారన్న విషయంపై ఇప్పటికే లైగర్ నిర్మాతలు పూరీ జగన్నాథ్, చార్మీలను ఈడీ అధికారులు విచారించారు.
తాజాగా లైగర్ హీరో విజయ్ దేవరకొండను కూడా విచారణకు పిలిచారు ఈడీ అధికారులు. మంగళవారం ఉదయం హీరో విజయదేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యాడు. లైగర్ సినిమా లావాదేవిలపై విజయ్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ డైరెక్షన్ చేయడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు. ఛార్మి కౌర్ సహ నిర్మాతగా వ్యవహరించింది.
భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడింది.