Pavitra Lokesh On Trolling: ట్రోలింగ్ చేస్తున్నవారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి పవిత్రా లోకేశ్.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నరేశ్, పవిత్రా లోకేష్ లపై ఇటీవల సోషల్ మీడియాలో పెద్దయెత్తున ట్రోలింగ్
Naresh, Pavitra (Credits: Twitter)

Hyderabad, Nov 27: సీనియర్ నటుడు నరేశ్ (Naresh), దక్షిణాది క్యారెక్టర్ నటి పవిత్రా లోకేశ్ (Pavitra Lokesh)కు ముడిపెడుతూ సోషల్ మీడియాలో (Social Media) ఇటీవల తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇద్దరికీ పెళ్లి (Marriage) అని, సహజీవనం (Living Relationship) చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి. దాంతో పవిత్రా లోకేశ్ పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ (Trolling) జరుగుతోంది.

పెను ప్రమాదం నుంచి బయటపడిన నిడదవోలు వాసులు.. నిడదవోలు నుంచి వారణాసికి 120 మంది.. గంగానదిలో బోటులో వెళ్లిన 40 మంది.. నదిలో కొంతదూరం వెళ్లాక బోటుకు చిల్లు.. బోల్తాపడిన బోటు.. అందరినీ రక్షించిన స్థానికులు

దీనిపై పవిత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పట్ల ట్రోలింగ్ కు పాల్పడుతున్న వారిపై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పట్ల వస్తున్న కథనాలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని మీడియా చానళ్లు, వెబ్ సైట్లు, యూట్యూబ్ చానళ్ళు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని పవిత్ర ఆరోపించారు.

చైనాలో ఒక్కరోజులోనే దాదాపు 40 వేల కొవిడ్ కేసులు.. అంతటా లాక్ డౌన్.. లాక్‌ డౌన్‌కు వ్యతిరేకంగా ఆగ్రహ జ్వాలలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు

తన ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారని, వాటిని వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటి ఫిర్యాదు నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.