A still from Nani's Gang Leader Trailer | Credits: Mythri Movie Makers.

28 రివేంజ్ కథలు రాశాడంటే అతడి ఆలోచనల్లో ఎంత పగ ఉంటుంది? నాని's గ్యాంగ్ లీడర్ సినిమా ఒక భయానక్ రివేంజ్ స్టోరీ! కాదు కాదు, ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్... అంటే ఒకరి రివేంజ్‌కు ఒక ప్రఖ్యాత రచయిత వారికి హెల్ప్స్ చేస్తాడు. ఆ రైటర్ ఎలాంటి వాడంటే ఆకలేస్తే అక్షరాలు తింటాడు, చలిస్తే పుస్తకాలు కప్పుకుంటాడు. కాన్సెప్ట్ బాగుంది, ఇదే కథ. కానీ ఎక్కడో తేడా కొడుతుంది. రివేంజ్ కథ అయినపుడు కథ సీరియస్‌గా నడవాలి గానీ ఆకలేస్తే రక్తం తాగుతా, పగను తింటా అని చెప్పకుండా అక్షరాలు తింటా అని కామెడీగా మాట్లాడుతున్నాడేంటి? అంటే ఇది కామెడీ కథ అయి ఉంటుంది. మళ్ళీ ఎంతటి మగాడ్నైనా అమ్మాయి మాయచేయగలదు అంటున్నాడు. అబ్బో, రైటర్ మంచి రొమాంటిక్‌గా కూడా ఉన్నాడు. కానీ విలన్ ఎంట్రీతో కథలో సీరియస్‌నెస్ వచ్చింది. సమర శంఖం పూరిస్తా అంటున్నాడు అంటే ఇది ఖచ్చితంగా యాక్షన్ సినిమా.

ఇంతకీ ఇది ఎలాంటి స్టోరీ? కన్‌ఫ్యూజింగా ఉంది కదా? అర్థమైంది, ఇది రొమాంటిక్ రివేంజ్‌ఫుల్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైన్‌మెంట్ స్టోరీ. తెలుగులో చెప్పాలంటే  'శృంగారభరిత ప్రతీకారపూరిత హాస్యరస నేరోద్విగ్న వీరోచిత వినోదాత్మకమైన' కథనా? ఏమో నాని's గ్యాంగ్ లీడర్ ట్రైలర్ చూసి మీరే డిసైడ్ అవ్వండి.

ఇదే ఆ ట్రైలర్.

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా, కన్నడ కమ్ తమిళ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్ గా, Rx100 హీరో కార్తికేయ మరో ప్రత్యేక పాత్రలో నటిస్తున్న చిత్రం "Nani's గ్యాంగ్ లీడర్". ఈ సినిమాను 'మనం' సినిమా ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. రొమాంటిక్ రివేంజ్‌ఫుల్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైన్‌మెంట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ కాబోతుంది.