Hyderabad, JAN 14: టాలీవుడ్‌లో (Tollywood) రియల్ లైఫ్ స్టోరీలకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే రూట్‌లో మహి వి రాఘవ్ (Mahi V Raghav) కాంపౌండ్ నుంచి 2019లో వచ్చిన పొలిటికల్ సినిమా యాత్ర (Yatra). ఏపీ (పూర్వ ఆంధ్రప్రదేశ్) దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (YS Rajashekar Reddy) ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ బయోపిక్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించారు. దీనికి కొనసాగింపుగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (YS Jagan) పొలిటికల్ జర్నీ నేపథ్యంలో ప్రస్తుతం సీక్వెల్ యాత్ర 2 (Yatra 2) రెడీ అవుతోంది. యాత్ర 2 ఫిబ్రవరి 8న గ్రాండ్‌గా విడుదలవుతుంది. ప్రజా సంక్షేమం కోసం తండ్రి ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ చేసిన వాగ్దానాలను ఎలా నిలబెట్టుకున్నారనే నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘యాత్ర 2’లోని ప్రధాన పాత్రలు గురించి ఇప్పటికే మేకర్స్ తెలియజేశారు. యాత్ర 2లో వై.ఎస్.భారతి రోల్‌లో కేతికా నారాయణన్ నటిస్తోండగా.. ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు (Chandra babu) పాత్రలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ మహేశ్ మంజ్రేకర్
నటిస్తున్నాడు.
సోనియాగాంధీ రోల్‌లో జర్మనీ నటి సుజానే బెర్‌నెర్ట్ నటిస్తోంది. ఇదిలా ఉంటే వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan),నారా లోకేశ్ (Nara Lokesh), వైఎస్ షర్మిల (Sharmila) కూడా ఉండగా.. మరి ఈ పాత్రల్లో ఎవరు కనిపించబోతున్నారని అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా ప్రకారం యాత్ర 2లో ఈ ముగ్గురి పాత్రలుండవు. కేవలం తండ్రీకొడుకుల జర్నీ నేపథ్యంలోనే సినిమా ఉండబోతున్నట్టు టాలీవుడ్ సర్కిల్
సమాచారం.
ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. యాత్ర 2ను Three Autumn Leaves, V Celluloid సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏపీ ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. యాత్ర 2 నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.