Hero Prabhas Snapped Sporting Face Mask at Hyderabad Airport to Protect Self From Coronavirus (Photo-Social Media)

Hyderabad, Mar 04: చైనాలో పుట్టి ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెడుతున్న కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను (Telugu States) కూడా హడలెత్తిస్తోంది. తెలంగాణలో (Telangana) ఓ కేసు నమోదు కాగానే సామాన్య ప్రజల్లో ఇప్పుడు భయాందోళనలు మొదలయ్యాయి. దీనికితోడు దేశ వ్యాప్తంగా కరోనా అనుమానితులు రోజు రొజుకు ఎక్కువవుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటున్నారు.

ఈ నేపథ్యంలో సామాన్యుల నుంచి సినిమా సెలబ్రిటీల వరకు అందరూ కరోనాపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిత్యం సినిమా షూటింగుల్లో బిజీగా ఉండే హీరోలు సైతం దీని దెబ్బకు హడలిపోతున్నారు. మాస్కులతో దర్శనమిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రముఖ సినీ హీరో ప్రభాస్‌కు (Hero Prabhas) సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో (social Media) చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోల ప్రభాస్ ముఖానికి మాస్క్ వేసుకుని వెళుతున్నారు. ఓ ఎయిర్‌పోర్టులో తీసిన ఈ వీడియోలో ప్రభాస్‌ మాస్క్‌ ధరించి వెళ్లడం చూస్తుంటే కరోనాపై జాగ్రత్తలు తీసుకోకుంటే చాలా ప్రమాదమేనని చాటి చెబుతున్నట్లుగా ఉంది. ప్రభాస్ తెల్లవారు జామున ఎయిర్ పోర్టులో మాస్కుతో కనిపించడంతో తోటిప్రయాణికులు, సిబ్బంది గుర్తుపట్టి ఆశ్చర్యానికి గురయ్యారు.

Here's Twitter Video

ఇప్పుడు ప్రభాస్‌ ప్రస్తుతం ‘జిల్‌’ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. తర్వాతి షెడ్యూల్ కోసం మూవీ యూనిట్ యూరప్ బయల్దేరింది. ప్రభాస్ తన 21వ సినిమాను ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది చివర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.