బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. ఆనంతరం అదే స్థాయిలో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు దక్షిణాసియా నంబర్ వన్ సెలబ్రిటీగా రెబల్‌స్టార్ ప్రభాస్ (Hero Prabhas) నిలిచారు. ఈ ఏడాదికిగానూ బ్రిటన్ వార పత్రిక ఈస్ట్రన్ ఐ (UK newspaper’s 2021) ఈ జాబితాను రూపొందించింది. గ్లోబల్ స్టార్లను వెనక్కి నెట్టి ప్రభాస్ మొదటిస్థానాన్ని దక్కించుకోవడం విశేషం. రెండో స్థానంలో బ్రిటిష్-పాక్ నటుడు రిజ్ అహ్మద్ నిలువగా.. మూడో స్థానంలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra), నాలుగు స్థానంలో ఇండియన్ అమెరికన్ మిండీ కలింగ్, ఐదోస్థానంలో గాయని శ్రేయా ఘోషల్ నిలిచారు.
ప్రస్తుతం పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లకు సంతకం చేసి బడా హీరోగా మారాడు. ఈ క్రమంలో ప్రభాస్ తన 25వ చిత్రం సందీప్ వంగ డైరెక్షన్‌లో చేయబోతున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనున్న ఈ చిత్రం దేశవ్యాప్తంగా 8 భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం రూపొందనుంది. దీంతో ప్రభాస్ ఇంటర్నేషనల్ హీరోగా కూడా మారనున్నాడు.
2021 ఏడాదికి సంబంధించి నెం. 1 సౌత్ ఏషియన్ సెలబ్రెటీగా ప్రభాస్ నిలిచాడు. యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) ఈస్టర్న్ ఐ వీక్లి అనే ప్రముఖ వెబ్ సైట్ నిర్వహించిన ఈ సర్వేలో ప్రభాస్ మొదటి స్థానం దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని సదరు వెబ్‌సైట్ వెల్లడిస్తూ ఓ కథనం ప్రచురించింది. ఈ జాబితాలో ఆసియా నుంచి మొత్తం 50 మంది సెలబ్రెటీలు పోటీపడగా.. అందరిలో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచాడని పేర్కొంది. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్‌తో పాటు కే, స్పిరిట్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.