రాజమౌళి నుంచి వస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం ఇంతకుముందు ఆయన నుంచి వచ్చిన భారీ సినిమాలు .. అవి సాధించిన సంచలన విజయాలు. సుదీర్ఘ కాలంగా షూటింగు జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా, అనేక విశేషాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ, ఈ రోజు ఉదయం ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను (RRR Trailer) రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ చూసిన చిరంజీవి (Chiranjeevi on RRR) వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందించారు. రామ చరణ్ ట్వీటును రీ ట్వీట్ చేశారు. ఈ ట్రైలర్ బీభత్సాన్ని సృష్టించిందనీ .. ఇక ప్రభంజనం కోసం జనవరి 7వ తేదీ వరకూ ఎదురుచూస్తుంటానని ఆయన (Megastar Chiranjeevi ) రాసుకొచ్చారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)