హైదరాబాదీ సినిమాలు చూస్తారా? హైదరాబాదీ సినిమాలు అంటే టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలు కాదు. వీటి కథా - కార్ఖానా మొత్తం అలగ్. జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ నుంచి వచ్చే కాస్ట్ లీ సినిమాలు కావివి, పాతబస్తీ దక్కనీ ఫిల్మ్ ఇండస్ట్రీలో తయారయ్యే ఖతర్నాక్ సినిమాలు ఇవి. పక్కా లోకల్ సినిమాలు అన్నమాట. ఈ సినిమాలకు, సినిమాలో నటించే ఆర్టిస్టులకు స్టార్ డమ్ హైదరాబాదులోనే కాదు, హిందీ సినిమాలు చూసే బాలీవుడ్ బ్యాచ్ కూడా ఇష్టంగా చూస్తారు. సినిమాలోని మాటలన్నీ అచ్చంగా తెలంగాణ- హైదరాబాద్ యాసలోనే ఉంటాయి. యాక్టర్స్ హిందీ- ఉర్దూ- తెలుగు ఏ భాషలో అయినా మాట్లాడతారు. ఈ సినిమాల్లో వాడే కొన్ని పంచ్ డైలాగ్స్ బైగన్, భాడకవ్, మాకి కిరికిరి, కుందల్ కుందల్ మారా లాంటి పదాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది.

2005 లో ద అంగ్రేజ్ సినిమాతో ఈ హైదరాబాదీ సినిమాల ట్రెండ్ స్టార్ట్ అయింది. అప్పట్లో వచ్చిన ది అంగ్రేజ్ మూవీ సూపర్ హిట్, ఇప్పటికీ ఈ మూవీ చాలా మందికి ఫేవరెట్. ఈ సినిమాలతోనే టాలీవుడ్ లో కూడా కొంత మంది ఆర్టిస్టులు పరిచయం అయ్యారు. హీరో నిఖిల్ కూడా టాలీవుడ్ లో హీరో అవ్వకముందు ఈ 'హైదరాబాద్ నవాబ్స్' సినిమాలలో చిన్న రోల్ లో కనిపించాడు.

ఇప్పటివరకూ వచ్చిన కొన్ని హైదరాబాదీ సినిమాలు.

The Angrez

Hyderabad Nawabs

The Angrez- 2

Fun aur Masti

Salam Zindagi

House full auto wala