Jabardasth comedian venu (Photo-Facebook)

జబర్దస్త్ షోలో మెరిసి కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు, 'బలగం' సినిమాతో డైరెక్టర్ గా తనని తాను నిరూపించుకున్న సంగతి విదితమే. రీసెంట్ గా వేణును మెగాస్టార్ చిరంజీవి తన షూటింగు సెట్ కి ఆహ్వానించి సినిమా చాలా బాగుందని అభినందించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు వేణు మాట్లాడుతూ, "సినిమాల్లో నటించాలనేదే నా ఆశయం .. అందుకోసం ఏమైనా చేయాలనే పట్టుదల ఉండేది. అందువలన బ్రతకడం కోసం చాలా పనులు చేస్తూ వెళ్లాను" అన్నాడు.

40 ఏళ్ళ క్రితమే భారత్‌కు తొలి ఆస్కార్ అవార్డు, ఇప్పటి వరకు భారత్‌కు చెందిన ఎవరెవరు, ఎప్పుడు ఆస్కార్ అందుకున్నారో ఓ సారి చూద్దామా..

'చిత్రం' శ్రీను దగ్గర రెండేళ్లు టచప్ బాయ్ గా చేశాను .. మేకప్ అసిస్టెంట్ గా చేశాను .. సినిమా సెట్స్ కి సంబంధించి రోజుకి 70 రూపాయలకు పనిచేశాను. అప్పుడు రూమ్ కూడా ఉండేది కాదు .. రోడ్లపై తిరగడం .. అరుగులపై పడుకోవడం చేసేవాడిని. అన్నదానాలు జరుగుతూ ఉంటే వెళ్లేవాడిని. నాలాగే పారిపోయి వచ్చిన వాళ్లు చాలామంది ఉండేవారు. మేమంతా కూడా బ్యాచులు బ్యాచులుగా తిరుగుతూ ఉండేవాళ్లం" అని చెప్పాడు.

వీడియో ఇదిగో..తెలుగులో ఉన్న 56 అక్షరాల్లో సంగీతం ధ్వనిస్తుంది, ఆస్కార్ వేదికపై తెలుగు గొప్పతనాన్ని మాటలతో వివరించిన చంద్రబోస్

"సినిమాల్లోకి వెళ్లాలంటే సినిమాలతో పరిచయం ఉన్నవారితో మనకి పరిచయం ఉండాలనే విషయం నాకు అర్థమైంది. అలాంటివారిని చూసుకుని, వాళ్లకి అన్నం వండిపెడతాను .. బట్టలు ఉతుకుతానని చెప్పాను. దాంతో ఒక బాయ్ గా నేను ఆ రూమ్ లో ఉండటానికి అంగీకరించేవారు. అలా సినిమాల్లోకి వెళ్లాను" అంటూ చెప్పుకొచ్చాడు.