Heroine Tejaswi Madiwada (Photo-Instagram)

ఐస్‌క్రీమ్‌ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తేజేస్వి మడివాడ (Ice Cream Heroine Tejaswi Madiwada) తాజాగా తన చిన్ననాటి విషయాలను షేర్ చేసుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమ్మడు..ఇన్‌స్టా‌గ్రాంలో తాజాగా ఓ ఫోటోను షేర్‌ చేసింది. 'చిన్నప్పుడు పానీపూరి బండివాడ్ని పెళ్లి చేసుకోవాలి ( I Was Child I Wanted To Marry Panipuri Wala) అనుకునేదాన్ని.

కానీ ఇప్పుడు నేను చిన్నపిల్లను కాదు కదా..ఇప్పుడు అసలు పెళ్లే అవసరం లేదని రియలైజ్‌ అయ్యాను' అంటూ పానీపూరి బండిని తోసుకెళ్తున్న ఫోటోను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. కొంపదీసి ఆ బండిని మీ ఇంటికి తీసుకెళ్తావా ఏంటి అంటూ కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన తేజస్వి.. ఆ తర్వాత 'లవర్స్‌', 'మనం', 'హార్ట్‌ ఎటాక్‌' సహా పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

Here's Heroine Tejaswi Madiwada Tweet

 

View this post on Instagram

 

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

అయితే 2018లో వచ్చిన బిగ్‌బాస్‌-2లో పాల్గొన్న అనంతరం తేజస్వి పలు విమర్శలను ఎదుర్కొంది. ముఖ్యంగా కౌశల్‌తో ప్రవర్తించిన తీరుతో ట్రోల్స్‌ బారిన పడి ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసుకుంది.

.