భారతీయుడు 2 చిత్రం టిక్కెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.75 పెంపునకు అనుమతించింది. ఈ సినిమా టిక్కెట్ ధరలను 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పింది. అలాగే ఈ వారం రోజుల పాటు థియేటర్‌లలో ఐదో షో ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు-2ను రూపొందించారు. భారతీయుడు-2 మూవీ ట్రైలర్ అదరహో, జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఇండియన్ 2 సినిమా
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు-2 చిత్రం తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ మంజూరు చేసింది. భారతీయుడు-2 మూవీ రన్ టైమ్ 180.04 నిమిషాలు. లైకా ప్రాడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవలే హైదరాబాదులో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రమోషన్ ఈవెంట్లు కూడా ముమ్మరంగా నిర్వహించారు.
ఈ చిత్రంలో కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ఎస్ జె సూర్య, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, బ్రహ్మానందం తదితరులు నటించారు. భారతీయుడు-2 చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.