కమల్ హసన్ నటిస్తున్న భారతీయుడు-2 చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. కమల్, దర్శకుడు శంకర్ కాంబినేషనల్‌లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రూపొందుతున్నది. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్నది. ఈ క్రమంలో తాజాగా ముంబయిలో జరిగిన కార్యక్రమంలో అన్ని భాషల్లో మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న రిలీజ్ కానుంది.
అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సేనాపతిగా ‘భారతీయుడు’ చిత్రంలో కమల్ హాసన్ మెప్పించారు. ఈ మూవీకి దీనికి కొనసాగింపుగా ‘భారతీయుడు-2’ రానున్నది. మూవీని అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో నిర్వహించగా.. సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్‌జే సూర్యా, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. మూవీకి చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)