Kaikala satyanarayana ( Image Source WIKIPEDIA)

Kaikala satyanarayana health condition critical: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (88) (Kaikala satyanarayana) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో సుపత్రిలో వెంటిలేటర్‌పై అందించి చికిత్స అందిస్తున్నారు. సత్యనారాయణ కోలుకోవాలని పలువురు నటీనటులు, అభిమానులు కోరుకుంటున్నారు. అయితే గత కొన్నిరోజుల క్రితం కైకాల సత్యనారాయణ ఇంట్లో కాలు జారిపడగా… ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. నవరస నట సార్వభౌమగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఖ్యాతిగాంచారు. తనదైన నటనలో అభిమానులను అలరించడమే కాదు.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. గత 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల గత కొంతకాలం క్రితం వరకూ తండ్రి, తాత పాత్రలను పోషించారు. సుదీర్ఘ సినీ కెరీర్ లో సుమారు 777 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు.

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25న జన్మించిన కైకాల..1959 లో సిపాయి కూతురు మూవీ తో వెండి తెరపై అడుగు పెట్టారు కైకాల. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎస్వీఆర్ తర్వాత ఆ రేంజ్ లో వైవిధ్య పాత్రల్లో నటించింది ఒక్క కైకాల మాత్రమే.. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో హాస్య, విలన్, హీరో గా నటించిన కైకాల సత్యనారాయణ కాలక్రమంలో నేటి తరానికి తండ్రి, తాత పాత్రల్లో కూడా నటించారు.