
Hyderabad, Oct 9: మహేశ్ బాబుతో (Mahesh babu) రాజమౌళి (Rajamouli) రూపొందించనున్న సినిమాలో పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్ర ఉంటుందట. ఆ పాత్ర సినిమాకే హైలైట్ కానుందట. మొదట ఐశ్వర్యరాయ్‌ని ఈ పాత్ర కోసం అడిగారట రాజమౌళి. అయితే.. ఏమైందోఏమో చివరకు కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఖరారైనట్టు తెలుస్తున్నది. రాజమౌళి ‘మగధీర’లో మిత్రవిందగా యువతరాన్ని ఉర్రూతలూగించింది కాజల్. మళ్లీ ఇప్పుడు అదే రాజమౌళి దర్శకత్వంలో నెగెటివ్ పాత్ర చేయనుండటం నిజంగా ఆసక్తికరమైన విషయమే.
