కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత (Kannada producer) సౌందర్య జగదీశ్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం తన నివాసంలో శవమై కనిపించాడు.గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన రాజాజీనగర్ (Rajajinagar)లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిర్మాతను పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు నిర్మాత మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో మరో విషాదం, ప్రముఖ తమిళ నటుడు అరుళ్మణి గుండెపోటుతో మృతి, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
జగదీష్ ‘అప్పు పప్పు’, ‘స్నేహితారు’, ‘రామ్లీల’, ‘మస్త్ మజా మాది’ వంటి అనేక చిత్రాలను నిర్మించి గుర్తింపు పొందారు. ఆయన ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు.. జగదీష్ మృతికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.