Mumbai Feb 06: లెజెండ్రీ సింగర్ లతా మంగేష్కర్ (Lata Mangeshkar) కన్నుమూశారు(Lata Mangeshkar Died). ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాసవిడిచారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఇటీవల కరోనా (Corona) నుంచి కోలుకున్న లతా ముంబయిలోని బ్రీచ్ క్యాడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కోవిడ్ కారణంగా జనవరి 11న ఆసుపత్రిలో చేరారు.
అయితే జనవరి నెలఖారున కరోనా నుంచి కోలుకున్న లతా ఆరోగ్యం శనివారం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై ఆమెకు వైద్యులు చికిత్సనందించినా ఆరోగ్యం విషమించడంతో ఆమె శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న లతా మంగేష్కర్ లేరన్న విషయాన్ని ఆమె అభిమానులను జీర్ణించుకోలేకపోతున్నారు.
Singing legend Lata Mangeshkar passes away, says Union Minister Nitin Gadkari pic.twitter.com/S1Rhc63OdI
— ANI (@ANI) February 6, 2022
లతా మంగేష్కర్ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ...ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.