Vardhan Puri (Photo Credits: IANS)

అమ్రిష్ పూరి మనవడు వర్ధన్ పూరి (Vardhan Puri) కాస్టింగ్‌ కౌచ్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాత వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 2019లో ‘యే సాలీ ఆషిఖి’ అనే సినిమాతో తెరంగేట్రం చేశాడు. అయితే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు.తాజాగా ఓ జాతీయ పత్రికతో మాట్లాడిన వర్థన్‌ పురి సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఈమధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఇది ఆడవాళ్లనే కాదు.. మగవాళ్లను సైతం వేధించే సమస్య అని ఆయన (Amrish Puri's grandson Vardhan Puri) కామెంట్స్ చేశాడు.

టాలీవుడ్‌లో మరో తీవ్ర విషాదం, సూసైడ్ చేసుకున్న యువ నటుడు సుధీర్ వర్మ, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు

దీన్ని అవకాశంగా వాడుకొని బడా సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తామని, తమ కోరికలు తీర్చాలని (directly ask for sexual favours) డైరెక్టుగానే తనను అడిగారని, దేవుడి దయ వల్ల తప్పించుకున్నానని వర్థన్‌ తెలిపాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి మనతో దారుణంగా ప్రవర్తిస్తారు. ఇంకొందరైతే డబ్బులు కూడా తీసుకుంటారు. తీరా చూస్తే వాళ్లు మోసం చేసి ఉడాయిస్తారు. చాలామంది నన్ను ఇలాగే వాడుకోవాలని చూశారు..అందుకే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను’’ అంటూ వర్థన్‌ చెప్పుకొచ్చాడు.

నటి అపర్ణ బాలమురళి పట్ల యువకుడి అనుచిత ప్రవర్తన... వీడియో వైరల్

లెజెండరీ నటుడి మనవడు అయినప్పటికీ, వర్ధన్ పాత ఇంటర్వ్యూలో తనను ఎప్పుడూ నెపోటిజం కిడ్ అని పిలవలేదని పేర్కొన్నాడు. “నేను ‘నేపో కిడ్’ అని చెప్పడానికి ఎవరూ నన్ను చూపలేదు. నేను చాలా చిన్నతనంలో నాటకరంగంలో ఉన్నప్పుడే మా తాతగారు చనిపోయారు. అతను ఏ సినిమా కాస్టింగ్‌ను ప్రభావితం చేయడానికి లేదా కాల్స్ చేయడానికి లేదా నన్ను సినిమాలో నటించడానికి ఆఫీసులకు వెళ్లడానికి ఎప్పుడూ అక్కడ లేడని తెలిపాడు.