Mahesh Babu Family, Varun tej -lavanya Tripati Visits Tirumala, videos goes viral

Tirumala, Aug 15:  ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మహేష్ బాబు ఫ్యామిలీ, మెగాహీరో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి. వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకోగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. నడక మార్గంలో మెట్లకు పూజలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టడంతోపాటు కర్పూరం వెలిగించారు. చివరి మెట్టు వద్ద కూడా కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు.మాజీ భర్తని గే అన్నందుకు క్షమాపణలు చెప్పిన త‌మిళ సింగ‌ర్ సుచిత్ర‌, వీడియో ఇదిగో..

Here's Video:

అలాగే సినీ నటుడు వరుణ్ తేజ్, సతీమణి లావణ్య త్రిపాఠి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.