![](https://test1.latestly.com/wp-content/uploads/2020/02/Chiranjeevi-New-Look-380x214.jpg)
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన లేటెస్ట్ మెగా మల్టీస్టారర్ 'ఆచార్య'. ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ (Acharya Movie Update) బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఉన్న 25 నిమిషాల సన్నివేశాలు చూసి మెగా అభిమానులకే కాకుండా కామన్ ఆడియన్స్‌కు పూనకాలొచ్చేస్తాయని తాజాగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన అన్వేశ్ రెడ్డి (Revealed by Producer anvesh reddy) తెలిపారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ (Director Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా (Megastar Acharya Movie) కోసం గత ఏడాది నుంచి అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 29న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఏప్రిల్ మొదటి వారం నుంచి చిత్రబృందం 'ఆచార్య' సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
అయితే, ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిర్మాత అన్వేశ్ రెడ్డి.. చిరు - చరణ్ కలిసి కనిపించే సమయం 25 నిమిషాల వరకు ఉంటుందని ఆ 25 నిమిషాలు సిల్వర్ స్క్రీన్ మీద మెగా హీరోలను చూస్తుంటే కన్నుల పండుగగా అనిపిస్తుందని తెలిపారు. అంతేకాదు, ఈ సన్నివేశాలు చూస్తుంటే అభిమానులకు థియేటర్స్‌లో పూనకాలొచ్చేస్తాయని అన్నారు. దాంతో గత కొన్ని నెలలుగా 'ఆచార్య' సినిమా కోసం ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహం రెట్టింపు అయింది.
ఇటీవలే వచ్చిన పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్'తో భారీ సక్సెస్ అందుకున్న చరణ్.. ఇదే జోష్‌తో 'ఆచార్య' మూవీతోనూ మరో భారీ హిట్ అందుకోవడం ఖాయమని అందరూ చెప్పుకుంటున్నారు. కాగా, ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించారు. సంగీత, రెజీనా స్పెషల్ సాంగ్స్‌లో అలరించబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి సురేఖ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైనెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి - అన్వేశ్ రెడ్డి నిర్మిస్తున్నారు.