Newdelhi, Sep 30: భారత సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే’ (Dadasaheb Phalke Award) అవార్డు దక్కించుకోవాలని ఎంతో మంది నటీనటుల కల. ఆ పురస్కారం లభిస్తే చాలు అనుకొనేవాళ్లు కోకొల్లలు. అలాంటి అద్భుతమైన ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారం ఈ ఏడాదికి ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)ని వరించింది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు మిథున్ చక్రవర్తి ఎంపికైనట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. అక్టోబర్ 8న జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నట్లు వెల్లడించింది.
మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు https://t.co/PPDM3Z1y6P
— Newsmeter Telugu (@NewsmeterTelugu) September 30, 2024
8 నెలల కిందటే పద్మభూషణ్ అవార్డు కూడా
మిథున్ చక్రవర్తి 1976లో సినీ ప్రస్థానం ప్రారంభించారు. నటుడిగా, నిర్మాతగా సేవలందించారు. ‘డిస్కో డాన్సర్’ చిత్రం ద్వారా విశేష ప్రేక్షకాదరణ పొందారు. ఇప్పటికే పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఇక సినీ రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ ఏడాది జనవరిలో ఆయనకు పద్మభూషణ్ అవార్డును కూడా అందజేసింది.