అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సముద్ర జాలర్ల బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్ పూర్తయింది. చైతూ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.40 కోట్లకు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) మూవీ రైట్స్‌ను దక్కించుకుంది. ఆ టీవీ ఛానల్ ఓనర్ రూమ్ బుక్ చేస్తా వస్తావా అని అడిగాడు, స్టార్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు, మే 3న విడుదల కానున్న శబరి
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘తండేల్’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. కొన్ని రోజుల కిందట హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌లో నాగచైతన్యపై ఓ భారీ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు. ఇది సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచే యాక్షన్ సీక్వెన్స్ అని చిత్రవర్గాలు తెలిపాయి. ప్రముఖ స్టంట్ మాస్టర్ సుప్రీమ్ సుందర్ ఈ ఎపిసోడ్‌కు నేతృత్వం వహించారు. తండేల్’ను బన్ని వాసు నిర్మిస్తున్నారు.