Hyderabad, January 24: మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru). సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్, హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు ఇప్పుడు మరింత కామెడీని జోడించేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతున్నారట . ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి (Anil ravipudi) స్వయంగా వెల్లడించాడు. దిల్ రాజు సమర్పణలో అనిల్ సుంకర, మహేష్ బాబులు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మహేష్ కెరీర్‌లోనే మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
అల వైకుంఠపురములో శ్రీకాకుళం జానపదం
నేటితో రెండు వారలు పూర్తి చేసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా చాలా చోట్ల మంచి కలెక్షన్స్ రాబడుతోంది. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇంకా ఎక్కువ చేయాలని సూపర్‌స్టార్ మహేష్‌బాబు, రావు రమేష్ ఫ్యామిలి మెంబర్స్ మధ్య వచ్చే ఒక మంచి హిలేరియస్ సన్నివేశాన్ని జనవరి 25(శనివారం) మార్నింగ్ షో నుండి అన్నిసెంటర్స్‌లలో యాడ్ చేస్తున్నాం’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు.
కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. రమణా..లోడ్ ఎత్తాలిరా..చెక్ పోస్ట్ పడతాది.. అంటూ ఒక్క డైలాగుతో కుమనన్ సేతురామన్ ఎనలేని క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా ఈ డైలాగ్ ప్రోమో వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.