Oscar Winners 2022: ఆస్కార్ 2022 విజేతలు వీరే, ఉత్తమ చిత్రంగా చైల్డ్ ఆఫ్ డెత్ అడల్ట్స్, ఉత్తమ నటుడుగా విల్ స్మిత్, ఉత్తమ నటిగా జెస్సికా చెస్టేన్, ఆస్కార్ 2022 విన్నర్స్ పూర్తి వివరాలు ఇవే..
Oscar Winners 2020 List | Photo: Twitter

సినీరంగంలో అత్యున్న‌త పురస్కారంగా భావించేది ‘ఆస్కార్’ అవార్డు. జీవితంలో ఒక్క సారైనా ఆస్కార్‌ను (Oscar Winners 2022) అందుకోవాల‌ని సినీప్ర‌ముఖులు ఆరాట ప‌డుతుంటారు. ప్ర‌తి ఏటా అత్యంత వైభ‌వంగా జ‌రిగే ఈ కార్య‌క్ర‌మాలు క‌రోనా కార‌ణంతో గ‌త రెండేళ్ళుగా ఎలాంటి హ‌డావిడి లేకుండా జరిగాయి. తాజాగా సోమ‌వారం 94వ అకాడ‌మి అవార్డులు (94th Academy Awards) అంగ‌రంగ‌ వైభ‌వంగా జ‌రిగాయి. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేట‌ర్లో అకాడ‌మి సంబురాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్రమానికి (Oscars 2022) ఎంతోమంది హాలీవుడ్ ప్ర‌ముఖులు హ‌జ‌ర‌య్యారు.

ఈ ఏడాది మొత్తం 276 చిత్రాల జాబితాలను వెల్ల‌డించిగా అందులో ఇండియా నుంచి సూర్య ‘జైభీమ్‌’, మోహ‌న్‌లాల్ ‘మ‌ర‌క్క‌ర్’ రెండు చిత్రాలు షార్ట్ లిస్ట్‌లో ఎంపిక అయ్యాయి. కానీ చివ‌రి నామినేష‌న్స్ జాబితాలో ఈ చిత్రాలు ఎంపిక కాలేక‌పోయాయి. ఉత్త‌మ డాక్యుమెంట‌రీ విభాగంలో ఇండియా నుంచి ‘రైటింగ్ విత్ ఫైర్’ చిత్రం నామినేట్ అయింది. కానీ ఈ చిత్రం కూడా అవార్డును గెలుచుకోలేక‌పోయింది. ఇక మొత్తం 23 విభాగాల్లో ఈ అకాడ‌మి అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. కాగా ఇప్ప‌టికే ‘ద పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌’ చిత్రం ఏకంగా 12 నామినేషన్లు దక్కించుకోగా ‘డ్యూన్‌’ చిత్రం పది విభాగాల్లో నామినేష‌న్ ద‌క్కించుకుంది. ఇక ‘వెస్ట్‌ సైడ్‌ స్టోరీ’, ‘బెల్‌ఫాస్ట్‌’ చిత్రాలకు ఏడేసి చొప్పున నామినేషన్లు లభించాయి.

నా భార్య మీదే జోక్ వేస్తావా, కమెడియన్ చెంప పగలగొట్టిన ఆస్కార్ ఉత్తమ నటుడు స్మిత్, తరువాత క్షమాపణలు కోరిన విల్ స్మిత్

ప‌ది విభాగాల్లో నామినేష‌న్ ద‌క్కించుకున్న ‘డ్యూన్’ చిత్రం ఇప్ప‌టికే ఆరు అవార్డుల‌ను గెలుచుకుంది. ఫ్రాంక్ హ‌ర్బ‌ట్‌ ర‌చించిన ‘డ్యూన్’ నోవెల్ ఆధారంగా డెన్నిస్ విల్లేనియువ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇక ఇప్పటికే ప్రకటించిన విభాగాల్లో ఈ చిత్రానికి బెస్ట్ సౌండ్‌, బెస్ట్ ఒరిజిన‌ల్ స్కోర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌, సినిమాటోగ్రఫీ(గ్రేగ్ ఫాజ‌ర్‌), ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్‌లో ఇలా ఆరు విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల‌ను గెలుచుకుంది.

ఉత్త‌మ చిత్రంగా ‘కోడా’ నిలువ‌గా ఉత్త‌మ అంత‌ర్జాతీయ చిత్రంగా జపాన్‌కు చెందిన ‘డ్రైవ్ మై కార్’ నిలిచింది. ఉత్త‌మ న‌టుడిగా ‘విల్ స్మిత్(కింగ్ రిచార్డ్)’, ఉత్త‌మ డైరెక్ట‌ర్‌గా ‘జానే కాంపీయ‌న్(ది ప‌వ‌ర్ ఆఫ్ ది డాగ్)’ ఆస్కార్ అవార్డుల‌ను అందుకున్నారు. ఉత్త‌మ స‌హాయ న‌టుడిగా ‘ట్రాయ్ కోట్సుర్‌కు(కోడా)’ ఆస్కార్ వ‌చ్చింది. ఉత్త‌మ స‌హాయ న‌టిగా ‘అరియానా డీబ్రోస్‌(వెస్ట్ సైడ్ స్టోరీ)’, ఉత్త‌మ డాక్యుమెంట‌రీ ఫీచ‌ర్ విభాగంలో’ స‌మ్మ‌ర్ ఆఫ్ సోల్‌’కు ఆస్కార్ అవార్డు వ‌రించింది.

ఆస్కార్ పురస్కార విజేతలు వీరే

ఉత్తమ చిత్రం : చైల్డ్ ఆఫ్ డెత్ అడల్ట్స్

ఉత్తమ నటుడు : విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్ )

ఉత్తమ నటి : జెస్సికా చెస్టేన్ (ద ఐస్ ఆఫ్ టామీ ఫే)

ఉత్తమ దర్శకుడు : ద పవర్ ఆప్ ద డాగ్ (జేన్ కాంపియన్)

ఉత్తమ సహాయనటి : అరియానా డిబోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ)

ఉత్తమ సహాయనటుడు : ట్రాయ్ కోట్సర్ (కోడా)

ఉత్తమ సినిమాటోగ్రఫీ : గ్రెగ్ ఫ్రెజర్ (డ్యూన్ )

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : నో టైమ్ టు డై

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ : సమ్మర్ ఆఫ్ సోల్

బెస్ట్ అడాప్టెడ్ స్ర్కీన్ ప్లే : కోడా (షాన్ హెడర్)

బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే : బెల్ ఫాస్ట్ (కెన్నత్ బ్రానా)

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ : జెన్నీ బీవన్ (క్రూయెల్లా)

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ : డ్రైవ్ మై కార్ (జపాన్)

బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ : ఎన్ కాంటో

బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : హన్స్ జిమ్మర్ (డ్యూన్ )

బెస్ట్ విజువల్ ఎఫెక్స్ట్ : (పాల్ లాంబర్ట్ , ట్రిస్టన్ మైల్స్, బ్రియన్ కానర్, గెర్డ్ నెఫెజర్ )

బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ : జో వాకర్ (డ్యూన్)

బెస్ట్ సౌండ్ : డ్యూన్ (మార్క్ రుత్, మార్క్ మాంగిని, థియో గ్రీన్, డగ్ హెంఫిల్, రాన్ బార్ట్ లెట్)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : డ్యూన్ (ప్రొడక్షన్ డిజైన్ - పాట్రన్ వెర్మట్, సెట్ డెకరేషన్ - జుజానా సిఫోస్)

బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ : ద ఐస్ ఆఫ్ ద టామీ ఫే (లిండా డౌడ్స్, స్టెఫానీ ఇన్ గ్రామ్, జస్టిన్ రాలే)

బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ : ది లాంగ్ గుడ్ బై

బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ : ది విండ్ షీల్డ్ వైపర్

బెస్ట్: డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ : ది క్వీన్ ఆఫ్ బాస్కెట్ బాల్