Oscars 2021 Nominations: భారత్ నుంచి ఒక్క సినిమా కూడా లేదు, ఆస్కార్ ఫైనల్ బరిలో నిలిచిన చిత్రాల లిస్టును విడుదల చేసిన ప్రియాంక- నిక్‌ జోనాస్‌ దంపతులు, ఏప్రిల్‌ 25న అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో 93వ ఆస్కార్‌ అవార్డుల వేడుక
MANK, The White Tiger (Photo Credits: Twitter)

కరోనా వల్ల ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కార్యక్రమం కొంచెం ఆలస్యం అయిన సంగతి విదితమే.కాగా ఆస్కార్ అవార్డుల వేడుక (Oscars 2021) ఎట్టకేలకు కన్పర్మ్ అయింది. 93వ ఆస్కార్‌ అవార్డుల వేడుక వచ్చే నెల ఏప్రిల్‌ 25న అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు ఆస్కార్‌. 2020ని ఈ వేడుకల్లో ప్రజెంట్ చేయనున్నారు.

ఆస్కార్‌ అవార్డుకు పోటీపడే చిత్రాల నామినేషన్‌ను లండన్‌లో ప్రియాంక- నిక్‌ జోనాస్‌ దంపతులు 2021 ఆస్కార్‌ నామినేషన్‌ చిత్రాల జాబితాను (Oscars 2021 Nominations) సోమవారం ప్రకటించారు. 2018లో వచ్చిన బ్లాక్‌ ఫాంథర్‌ సినిమాతో చాడ్విక్ బోస్మాన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అతను నటించిన ‘మా రైనీస్ బ్లాక్ బాటమ్’ చిత్రం ప్రస్తుతం ఉత్తమ నటుడు కేటగిరీలో ఆస్కార్‌ రేసులో ఉంది. కాగా, బోస్మాన్ గతేడాది క్యాన్సర్‌తో మరణించడం విషాదకరం. డేవిడ్ ఫించర్ దర్శకత్వంలో వచ్చిన మాంక్ (MANK Leads the Race) చిత్రం 10 విభాగాల్లో నామినేషన్లు పొంద‌డం విశేషం.

నా పొలిటికల్ ఎంట్రీ మీ చేతుల్లో, మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రెస్ మీట్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన జూనియర్ ఎన్టీఆర్, రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఇది సమయం కాదని దాటవేత

క్రిస్టొఫర్ నొలన్ దర్శకత్వం వహించిన టెనెట్‌ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఉంది. ఇదిలా ఉండగా భారత్‌ నుంచి ఆస్కార్‌కు పోటీప​​డ్డ సూరారై పొట్రు (ఆకాశమే నీ హద్దురా..!) ఆస్కార్‌ బరిలో నుంచి వైదొలిగింది. గ‌త ఏడాది దర్శకత్వ విభాగంలో మహిళలను పట్టించుకోకపోవడం పై ఆస్కార్‌పై తీవ్ర విమర్శలు రావ‌డంతో తొలిసారి ఇద్దరు మహిళలు (క్లో ఝావో, ఎమరాల్డ్ ఫెన్నెల్) ల‌ను నామినేట్ చేశారు. ఝావో ఆస్కార్ నామినేషన్ పొందిన తొలి ఆసియా సంతతి మహిళగా నిలిచింది.

ఏ కేటగిరీకి ఎవరెవరు నామినేట్ ..

ఉత్తమ చిత్రం

ద ఫాదర్

జూడాస్ అండ్ ద బ్లాక్ మెస్సయ్యా

మాంక్

మినారి

నోమాడ్ ల్యాండ్

ప్రామిసింగ్ యంగ్ ఉమన్

సౌండ్ ఆఫ్ మెటల్

ద ట్రయల్ ఆఫ్ షికాగో 7

ఉత్తమ దర్శకుడు

క్లో ఝావో (నోమాడ్ ల్యాండ్)

లీ ఇసాక్ చుంగ్ (మినారి)

డేవిడ్ ఫించర్ (మాంక్)

ఎమరాల్డ్ ఫెన్నెల్ (ప్రామిసింగ్ యంగ్ ఉమన్)

థామస్ వింటర్ బెర్గ్ (ఎనదర్ రౌండ్)

ఉత్తమ నటి

కేరీ ముల్లిగాన్ (ప్రామిసింగ్ యంగ్ ఉమన్)

ఫ్రాన్సెస్ మెక్ డోర్మాండ్ (నోమాడ్ ల్యాండ్)

వయోలా డేవిస్ (మా రెయినీస్ బ్లాక్ బాటమ్)

వెనెస్సా కిర్బీ (పీసెస్ ఆఫ్ ఏ ఉమన్)

ఆండ్రా డే (ద యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలీడే)

ఉత్తమ నటుడు

చాడ్విక్ బోస్ మన్ ( మా రెయినీస్ బ్లాక్ బాటమ్)

రిజ్ అహ్మద్ (సౌండ్ ఆఫ్ మెటల్)

ఆంథోనీ హాప్కిన్స్ (ద ఫాదర్)

గ్యారీ ఓల్డ్ మన్ (మాంక్)

స్టీవెన్ యేన్ (మినారి)

ఉత్తమ సహాయనటి

మరియా బకలోవా (బోరాట్ సబ్ సీక్వెంట్ మూవీ ఫిల్మ్)

గ్లెన్ క్లోజ్ (హిల్ బిల్లీ ఎలెజీ)

ఒలీవియో కోల్మన్ (ద ఫాదర్)

అమందా సేఫ్రీడ్ (మాంక్)

యు జంగ్ యోన్ (మినారి)

ఉత్తమ సహాయనటుడు

సాషా బరోన్ కోహెన్ (ద ట్రయల్ ఆఫ్ షికాగో 7)

లెస్లీ ఓడోమ్ జూనియర్ (వన్ నైట్ ఇన్ మయామీ)

డేనియల్ కలూయా (జూడాస్ అండ్ ద బ్లాక్ మెస్సయ్యా)

పాల్ రేసీ (సౌండ్ ఆఫ్ మెటల్)

లాకీత్ స్టాన్ ఫీల్డ్ (జూడాస్ అండ్ ద బ్లాక్ మెస్సయ్య)

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీ

విల్ బెర్సన్ & షాకా కింగ్, (జుడాస్ అండ్‌ బ్లాక్ మెసయ్య)

లీ ఐజాక్ చుంగ్, (మినారి)

ఎమరాల్డ్ ఫెన్నెల్, (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్)

డారియస్ మార్డర్ & అబ్రహం మార్డర్, (సౌండ్ ఆఫ్ మెటల్)

ఆరోన్ సోర్కిన్, (ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7)

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీ

లవ్ అండ్ మాన్స్టర్స్

మిడ్నైట్ స్కై

ములన్

ది వన్ అండ్ ఓన్లీ ఇవాన్

టెనెట్

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ

ఆన్‌వర్డ్‌

ఓవర్‌ ద మూన్‌

ఎ షాన్ ది షీప్ మూవీ: ఫార్మగెడాన్

సౌల్‌

వోల్ఫ్‌ వాకర్స్‌

ఇవే కాకుండా బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ యానిమేషన్ చిత్రం, బెస్ట్ సౌండ్, బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లోనూ నామినేషన్లు ప్రకటించారు.