Michelle Yeoh (Photo-AFP)

ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ మూవీ స్టార్ మిచెల్ యోహ్ (Michelle Yeoh wins) , ఆసియా ప్రాతినిధ్యం కోసం ఒక చారిత్రాత్మక క్షణంలో ఉత్తమ నటి ఆస్కార్‌ను గెలుచుకున్నారు. ఆమె గత సంవత్సరంలో అత్యుత్తమ మహిళా నటనా ప్రదర్శన రేసులో కేట్ బ్లాంచెట్ ( తార్ ), మిచెల్ విలియమ్స్ ( ది ఫేబుల్‌మాన్స్ ) వంటి వారిని ఓడించింది .

యోహ్ ఉత్తమ నటి ( Michelle Yeoh wins best actress award) ఆస్కార్‌ను గెలుచుకున్న మొదటి ఆసియా మహిళగా నిలిచింది. డైమెన్షన్-హోపింగ్ సూపర్‌విలన్‌కి వ్యతిరేకంగా చైనీస్-అమెరికన్ కుటుంబం యొక్క యుద్ధం గురించిన సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ చిత్రంలో ఆమె శక్తివంతమైన నటనను ప్రదర్శించింది.

వీడియో ఇదిగో..తెలుగులో ఉన్న 56 అక్షరాల్లో సంగీతం ధ్వనిస్తుంది, ఆస్కార్ వేదికపై తెలుగు గొప్పతనాన్ని మాటలతో వివరించిన చంద్రబోస్

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎవరైనా మీ ప్రైమ్‌ టైమ్‌ను మీరు దాటిపోయారు అంటే నమ్మొద్దు.ఈ అవార్డుని నేను మా అమ్మకు... ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ అంకితం ఇస్తున్నాను. ఎందుకంటే వారే నిజమైన సూపర్‌హీరోస్‌. వీరే లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఎవరూ ఉండి ఉండేవారు కాదు.మా అమ్మగారికి 84 ఏళ్లు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఇప్పుడు మలేసియాలో ఆమె ఈ వేడుకను చూస్తున్నారు.

నేను ఈ అవార్డును ఇంటికి తీసుకువస్తున్నాను (కుటుంబ సభ్యులను ఉద్దేశించి). అలాగే నా కెరీర్‌ హాంకాంగ్‌లో స్టార్ట్‌ అయ్యింది. అక్కడ నాకు హెల్ప్‌గా ఉన్నవారికి ధన్యవాదాలు. అలాగే నెవర్‌ గివప్‌. డానియల్‌ డ్యూయో, ఏ 24 షూటింగ్‌ స్టూడియో, ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌..’ నటీనటుల సహాయం లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ ఈ వేదికపై ఉండేదాన్ని కాదని అన్నారు. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ సినిమాకు గాను మిషెల్‌యో ఉత్తమ నటి అవార్డుతో ఆస్కార్‌ అందుకుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ఇప్పుడామె వయస్సు 60ఏళ్లు.

40 ఏళ్ళ క్రితమే భారత్‌కు తొలి ఆస్కార్ అవార్డు, ఇప్పటి వరకు భారత్‌కు చెందిన ఎవరెవరు, ఎప్పుడు ఆస్కార్ అందుకున్నారో ఓ సారి చూద్దామా..

ఇక ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్న బ్రెండెన్‌ ఫ్రాజెర్‌ వయస్సు కూడా 54 ఏళ్లు. బ్రెండెన్‌ ఫ్రాజెర్‌ మాట్లాడుతూ నాకు అవార్డు ఇచ్చిన ఆస్కార్‌ కమిటీకి, ఇలాంటి ఓ బోల్డ్‌ ఫిల్మ్‌లో నటించే అవకాశం కల్పించినవారికి ప్రత్యేక ధన్యవాదాలు. ‘ది వేల్‌’ సినిమాలో భాగమైన వారిని గుర్తు చేసుకోకుండా ఉండలేను. బెస్ట్‌ యాక్టర్‌గా నాకు అవార్డు రావడాన్ని చాలా గౌరవంగా ఫీల్‌ అవుతున్నాను. నటుడిగా నేను 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను.

కొన్ని సందర్భాల్లో నాకు గుర్తింపు వస్తుందా? అని ఆలోచించాను. అలా ఆలోచించినప్పుడు చాలా కష్టంగా అనిపించింది. కేవలం తిమింగలాలు మాత్రమే లోలోతుల్లో ఈదగలవు. సినిమా ఇండస్ట్రీలో నేనూ అంతే. నాకు హెల్ప్‌గా ఉన్న నా కుటుంబ సభ్యలకు ధన్యవాదాలంటూ ఎమోషన్ అయ్యారు.