
నిన్నటి వరకు ఫేస్‌బుక్, ట్విట్టర్ లో మాత్రమే ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టాడు. ఉదయం ఆయన ఖాతా తెరిచిన కాసేపటికే వెరిఫైడ్ లభించింది. ఈ ఖాతాను ప్రారంభించిన గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్ దాటేశారు.
సింగిల్ పోస్ట్ లేకుండానే ఫాలోవర్స్ పెరిగిపోయారు. ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా ఆయన రాజకీయాలకు సంబంధించిన విషయాలను ఎక్కువగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఇన్‌స్టా వేదికగా రాజకీయాలతో పాటు సినిమా విశేషాలను కూడా షేర్ చేయనున్నారని తెలుస్తోంది. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో... జై హింద్ అనే స్లోగన్ ను చేర్చారు.
పవన్ సినిమాల విషయానికొస్తే.. సాయిధరమ్ తేజ్‌తో కలిసి ఆయన నటించిన ‘బ్రో’ జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సముద్రఖని దర్శకుడు. దీంతో పాటు, సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’లో నటిస్తున్నారు. ఇప్పటికే 50శాతం చిత్రీకరణ పూర్తయింది. మరోవైపు హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడితో పీరియాడికల్ మూవీ ‘హరి హర వీర మల్లు’లోనూ నటిస్తున్నారు.