Nikesha Patel (Twitter)

హీరోయిన్ నిఖీషా పటేల్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2010లో వచ్చిన కొమరం పులి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ( Komaram puli Heroine ) ఇచ్చింది అమ్మడు. ఈ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర నిరాశపర్చడంతో నిఖీషాకు తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. ఫలితంగా కొమరం పులి తర్వాత ఆమె (Nikesha Patel) మళ్లీ తెలుగు సినిమాలో కనిపించనేలేదు. తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో అభిమానులతో సంభాషించింది. నెటిజన్లు అడిగే పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.

మహేశ్‌బాబు గురించి చెప్పండి అని అడగ్గా ఫెయిర్‌ అండ్‌ లవ్లీ అని సింగిల్‌ లైన్‌లో జవాబిచ్చింది. ప్రభాస్‌ గురించి ఏదైనా చెప్పండి అంటే అతడు తనకు మంచి ఫ్రెండ్‌ అని, కాకపోతే చాలా పొడుగ్గా ఉంటాడంది. రజనీకాంత్‌ గురించి ఒక్క ముక్కలో చెప్పమంటే కింగ్‌ అని ఆన్సరిచ్చింది. ఫేవరెట్‌ యాక్టర్‌ ఎవరంటే మాత్రం ఎప్పటికీ ధనుషే అని బదులిచ్చింది. పవన్‌ కల్యాణ్‌ గడ్డం అంటే ఇష్టమన్న నిఖీషా.. మెగాస్టార్‌ గురించి చెప్పండి అంటే మాత్రం ఇండస్ట్రీలో చాలామంది మెగాస్టార్లు ఉన్నారు. ఇంతకీ మీరు ఏ మెగాస్టార్‌ గురించి అడుగుతున్నారు? అని అడిగింది.

ఏ బాల్కనీలో అయితే ప్రేమించుకున్నామో అక్కడే మా పెళ్లి, వైరల్ అవుతున్న ఆలియాభట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ పెళ్లి ఫోటోలు

ఆమె ఆన్సర్‌ విని ఆశ్చర్యపోయిన కొందరు 'మెగాస్టార్‌ ఎవరో తెలీదా? పవన్‌తో సినిమా చేశావు, ఆయన బ్రదర్‌ మెగాస్టార్‌ చిరంజీవి అన్న విషయం తెలియదంటే నమ్మశక్యంగా లేదు', 'ఇందుకే నీకు సినిమా అవకాశాలు రావడంలేదు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సల్మాన్‌ ఖాన్‌, మమ్ముట్టిని కూడా మెగాస్టార్‌ అంటారు. కాబట్టే ఆమె అలా అడిగింది' అని మరికొందరు సదరు హీరోయిన్‌ను వెనకేసుకొస్తున్నారు. ఇక పెళ్లెప్పుడు అన్న ప్రశ్నకు నిఖీషా వరుడు దొరికేశాడని, అతడు యూకేలో ఉంటున్నాడని చెప్పింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని గుడ్‌న్యూస్‌ పంచుకుంది.