Piyush Mishra (Photo Credits: Twitter)

సినీరచయిత, సింగర్‌, నటుడు పీయూశ్‌ మిశ్రా చిన్నతనంలో లైంగిక వేధింపులను (Piyush Mishra Sexual Assault) ఎదుర్కొన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 7వ తరగతి చదివే సమయంలో (Sexually Assaulted in Seventh Grade) తన బంధువొకరు రూంలోకి తీసుకువెళ్లి లైంగికంగా వేధించిందని పేర్కొన్నాడు. తుమ్హారీ అక్కత్‌ క్యా హై పీయూశ్‌ మిశ్రా అనే ఆటోబయోగ్రఫీ పుస్తకంలో ఈ విషయాన్ని పొందుపరిచాడు.

ప్రాజెక్ట్‌ కె షూటింగ్‌‌లో ప్రమాదం, అమితాబ్‌ బచ్చన్‌కు విరిగిన పక్కటెముకలు, రెండు వారాలు బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచన

నటుడు పీయూశ్‌ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. శృంగారం అనేది ఆరోగ్యకరమైన విషయం. కానీ అది అభ్యంతరకరంగా, అయిష్టంగా ఉంటే మాత్రం దాని నుంచి కోలుకోవడానికి జీవితమే సరిపోదు. జీవితాంతం మాయని మచ్చలా అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఏడవ తరగతిలోనే మహిళా బంధువొకరు నన్ను లైంగికంగా వేధించింది. తనే కాదు, మరికొందరి పేర్లను కూడా నేను గుట్టుచప్పుడుగానే ఉంచాలనుకుంటున్నాను. ఎందుకంటే వారిలో కొందరు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో బాగా స్థిరపడ్డారు.

ఎనిమిసులో తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా.. నాపై జరుగుతున్న వేధింపుల గురించి అమ్మకు చెబితే నమ్ముతుందో, లేదోనని భయపడ్డా.. సినీ నటి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

కాబట్టి ఈ సమయంలో వారిపై ప్రతీకారం తీర్చుకోలేనని చెప్పుకొచ్చాడు. ఇకపోతే పీయూశ్‌ మిశ్రా గులాల్‌, గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసీపూర్‌, మఖ్బూల్‌, తమాషా వంటి చిత్రాల్లో నటించాడు. బాల్లిమారన్‌ అనే మ్యూజిక్‌ బ్యాండ్‌లో తను పాటలు రాసి వాటిని తనే స్వయంగా ఆలపించాడు.