Poonam Pandey Engagement: పూనం పాండే పెళ్లికి రెడీ అయింది, బాలీవుడ్ దర్శకుడు సామ్‌ బాంబెతో హాట్ బ్యూటీ నిశ్చితార్థం, వివాహ తేదీపై ఇంకా క్లారిటీ ఇవ్వని ముద్దుగుమ్మ
Poonam Pandey gets engaged to Sam Bombay (Photo Credits: Instagram)

ఫిలీం ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. నిన్ననే టాలీవుడ్ హీరో నితిన్ వివాహం జరగ్గా.. ఇప్పుడు బాలీవుడ్ కు చెందిన హాట్ బ్యూటీ పూనమ్ పాండే (Poonam Pandey) వివాహానికి రెడీ అవుతున్నది. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌ బాలీవుడ్ దర్శకుడు సామ్‌ బాంబెతో పూనమ్‌ నిశ్చితార్థం (Poonam Pandey - Sam Bombay engaged) జరిగింది. ఈ విషయాన్ని సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. వారిద్దరు రింగ్‌లు మార్చుకున్న ఫొటోను సామ్‌ షేర్‌ చేశారు. ‘చివరకు మేము.. పూర్తి చేసాం’ అని పేర్కొన్నారు. దీనిపై కామెంట్‌ చేసిన పూనమ్‌.. బెస్ట్‌ ఫీలింగ్‌ అని అన్నారు. పవర్ స్టార్ వర్సెస్ పరాన్న జీవి, ట్విట్టర్ వేదికగా ముదిరిన యుద్ధం, వర్మను కుక్కతో పోల్చిన హీరో నిఖిల్, ఆ నిఖిల్..కిఖిల్ ఎవడో తెలియదంటూ వర్మ రివర్స్ కౌంటర్

అయితే, వివాహం ఎప్పుడు ఎక్కడ జరగబోతుంది అనే దానిపై ఈ జంట (Poonam Pandey - Sam Bombay) ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే తేదీని ప్రకటిస్తామని అంటోంది పూనమ్ పాండే. పూనమ్ సినిమాల్లో కంటే తన హాట్ హాట్ ఇంస్టాగ్రామ్ ఫొటోలతోనే అభిమానులకు చేరువైంది.

Here's Sam Tweet

 

View this post on Instagram

 

We finally did it!

A post shared by Sam Bombay (@sambombay) on

కాగా, సామ్‌, పూనమ్‌లు గత కొద్దికాలంగా డేటింగ్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే పూనమ్‌ కూడా తనదైన వ్యాఖ్యలతో పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా మే నెలలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు వీరిద్దరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఖండిచిన పూనమ్‌.. తాను సమయంలో ఇంట్లో సినిమా చూస్తూ ఉన్నట్టు తెలిపారు