Hyderabad November 28: ప్రముఖ కొరియోగ్రాఫర్(Choreographer ), నటుడు(Actor) శివ శంకర్ మాస్టర్(72)( Shiva Shankar) కన్నుమూశారు. ఇటీవల కరోనా(Corona) బారిన పడిన ఆయన హైదరాబాద్ ఏఐజీలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తమిళ(Kollywood), తెలుగు(Tollywood) చిత్రాలతో పాటూ 10 భాషల్లోని 800లకు పైగా చిత్రాల్లో పాటలకు ఆయన కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. అత్యధికంగా దక్షిణాది భాషా చిత్రాలకు పనిచేశారు. 1975లో ‘పాట్టు భరతమమ్’ చిత్రానికి సహాయకుడిగా కెరీర్ ప్రారంభించిన శివశంకర్ మాస్టర్ ‘కురువికూడు’ చిత్రంతో కొరియోగ్రాఫర్‌గా మారారు.
కేవలం కొరియోగ్రాఫర్‌గానే కాదు, నటుడిగా వెండితెరపైనా తనదైన ముద్రవేశారు. 2003లో వచ్చి ‘ఆలయ్’చిత్రంతో నటుడిగా మారిన శివ శంకర్ మాస్టర్ దాదాపు 30కి పైగా చిత్రాల్లో వైవిధ్య నటనతో నవ్వులు పంచారు. స్మాల్ స్క్రీన్(Television) మీద కూడా తనదైన ముద్రవేశారు. పలు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహించారు.
శివశంకర్ మాస్టర్ వద్ద శిష్యరికం చేసిన ఎంతో మంది కొరియోగ్రాఫర్‌లు ప్రస్తుతం టాప్ నృత్య దర్శకులుగా కొనసాగుతున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. విజయ్ శివ శంకర్, అజయ్ శివ శంకర్ ఇద్దరూ డ్యాన్స్ మాస్టర్లే.
కరోనా బారిన పడ్డ శివశంకర్ మాస్టర్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు సోనూసూద్(Sonu Sood), ధనుష్(Dhanush), చిరంజీవి(Chiranjeevi)లు తమవంతు సాయం చేశారు. అయినా మాస్టర్ ప్రాణాలు దక్కలేదు. ఆయన ఇక లేరన్న వార్తతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శివశంకర్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు.