రాజ్ కుంద్రా పోర్న్ చిత్రాల రాకెట్ కేసులో బాలీవుడ్ నటి పూనమ్ పాండేకు సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. అరెస్ట్ నుంచి ఆమెకు తాత్కాలిక రక్షణ లభించింది. ఇదే కేసులో (Pornography Case) ప్రధాన నిందితుడిగా ఉన్న శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా సైతం అరెస్ట్ నుంచి ఇదివరకే రక్షణ పొందడం తెలిసిందే. దీంతో తనకు సైతం అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ పూనమ్ పాండే బాంబే హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు కొట్టివేసింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీవీ నారగత్నతోకూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మహారాష్ట్ర సర్కారుకు తాజాగా నోటీసులు జారీ చేసింది. కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పిటిషనర్ (పాండే)కు వ్యతిరేకంగా ఎటువంటి బలవంతపు చర్యలకు దిగొద్దని సర్కారును ఆదేశించింది. లైంగికంగా అసభ్యకరమైన వీడియోలను పంపిణీ చేస్తున్నారంటూ (Raj Kundra's pornography case) వివిధ సెక్షన్ల కింద ముంబై సైబర్ సెల్ పోలీసులు రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే కేసులో షెర్లిన్ చోప్రాతోపాటు పాండే పేర్లను కూడా పోలీసులు చేర్చారు. దీంతో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ వారు న్యాయస్థానాలను ఆశ్రయించారు.
కర్తార్‌పూర్ గురుద్వారా దర్బార్ సాహిబ్‌లో ఫోటో షూట్, క్షమాపణలు చెప్పిన పాకిస్థాన్ మోడల్ సౌలేహ
ఇక భర్త సామ్ బాంబే టార్చర్ పెడుతున్నాడంటూ ఆమధ్య రచ్చ రచ్చ చేసిన పూనమ్ పాండే కొన్ని ఆసక్తిర విషయాలు చెప్పుకొచ్చింది. తన గురించి మాట్లాడాలంటే ఇష్ట పడటంలేదు. తను పడ్డ బాధలనుంచి రిలీఫ్ పొందడానికి ఓ థెరపిస్ట్ దగ్గర పూనమ్ పాండే. ట్రీట్ మెంట్ తీసుకుంటుంది. భర్త నుంచి దూరంగా ఉంటున్న పూనమ్ పాండేను మీరు ఇంకా ఎవరితోనైనా డేటింగ్ లో ఉన్నారా..? ఎవరితోనైనా కలిసే అవకాశం ఉందా..? అని ప్రశ్నిచగా. ఆ ఛాన్స్ లేనే లేదు అంటూ ఖచ్చితంగా చెప్పేసింది. తాను ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నానని. ఇంకో ఐదేళ్ళ వరకూ ఎవరితో కలిసి డేటింగ్ చేసే ప్రసక్తే లేదు అంటోంది. బాలీవుడ్ డైరెక్టర్ సామ్ బాంబేను 2019 లో పెళ్ళి చేసుకున్న పూనమ్ పెళ్ళి జరిగిన కోన్ని రోజులకే భర్త హింసిస్తున్నాడు అంటూ పోలీస్ స్టేషన్ గడప తొక్కింది.