 
                                                                 Mumbai, September 18: పోర్న్ చిత్రాలు నిర్మించి యాప్స్ ద్వారా ఆన్‌లైన్‌లో వినియోగంలోకి తెచ్చారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా (Raj Kundra Porn Case) తాజాగా ముంబైలోని కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ముంబై పోలీసులు ఈ కేసులో (pornographic content case) భాగంగా తాజాగా కోర్టు అందజేసిన అనుబంధ చార్జ్‌షీట్‌లో తనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా సమర్పించలేదని, బెయిల్ ఇవ్వాలని కోర్టును కుంద్రా కోరారు.
ఈ కేసులో తనను బలిపశువును చేశారని మెట్రోపాలిటన్ కోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రాక్టికల్‌గా చూస్తే ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసుల దర్యాప్తు ముగిసిపోయిందని కుంద్రా తరఫు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ అభిప్రాయ పడ్డారు. హాట్‌షాట్స్ యాప్స్‌లో ఉన్న శృంగార వీడియోల రూపకల్పనలో కుంద్రా క్రియాశీల పాత్ర పోషించారనే ఏ ఒక్క ఆధారాన్నీ పోలీసులు అనుబంధ చార్జ్‌షీట్‌లో పొందు పరచలేదని న్యాయవాది వివరించారు.
వాస్తవానికి సంబంధిత నటులే ఆయా వీడియోలను యాప్స్‌లోకి అప్‌లోడ్ చేశారన్నారు. పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా కుంద్రాకు వ్యతిరేకంగా అభియోగాలకు బలంచేకూర్చే ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లభించలేదన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో మొదట కుంద్రా పేరు లేదని, పోలీసులే తర్వాత జతచేశారని న్యాయవాది ఆరోపించారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
