Prabhas: ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగే దసరా ఉత్సవాలకు ప్రభాస్ కు ఆహ్వానం.. డార్లింగ్ చేతుల మీదుగానే రావణ దహన కార్యక్రమం?!

NewDelhi, September 13: దసరా ఉత్సవాలకు యావత్ దేశం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. దసరా ఉత్సవాల చివరి రోజున రావణ దహనం కార్యక్రమాన్ని జరుపుతారు. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలను ఆహ్వానించడం పరిపాటిగా వస్తోంది. సెలబ్రిటీల చేతుల మీదుగానే రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మరోవైపు, రావణ దహన కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఆహ్వానం అందినట్టు సమాచారం.

విజయ్-పూరీ ‘జనగణమన’ చిత్రం అటకెక్కేసినట్టేనా?.. విజయ్ దేవరకొండ వ్యాఖ్యల అర్థమిదేనా? అసలేం జరిగిందంటే??

ప్రస్తుతం ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నాడు. దీంతో, ప్రభాస్ ను గెస్ట్ గా పిలిచినట్టు సమాచారం. ఆయన చేతుల మీదుగానే రావణ దహన కార్యక్రమం నిర్వహించనున్నట్టు వినికిడి.