కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో (Puneeth Rajkumar Dies) మరణించారు. ఈ ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తుండగా ఆయన కుప్పకూలిపోయారు. తీవ్రస్థాయిలో ఛాతీలో నొప్పి రావడంతో పునీత్ రాజ్ కుమార్ ను సహాయకులు, జిమ్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. పునీత్ బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమించడంతో ఆయన తిరిగిరాని లోకాలకు (Puneeth Rajkumar No More) వెళ్లిపోయారు.
పునీత్ ఆసుపత్రిపాలైన విషయం తెలుసుకుని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై హుటాహుటీన ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. పునీత్ వయసు 46 సంవత్సరాలు. దివంగత మహానటుడు రాజ్ కుమార్ తనయుల్లో ఒకడైన పునీత్ కన్నడ నాట అగ్రహీరోగా గుర్తింపు పొందారు. ఆయన మృతికి సంతాపంగా కర్ణాటక ప్రభుత్వం అన్ని సినిమా హాళ్లను మూసివేసింది. అభిమానులు ఆస్పతికి పోటెత్తడంతో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఆస్పత్రితో పాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. . ఇప్పటికే శాండల్‌వుడ్ సినీ ప్రముఖులు విక్రమ్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
Here's Siddharth, sonu sood Tweets
I cannot process this. Cannot believe you've left us Puneeth. Kind, gifted, fearless...so much to give to the world. This is not fair brother. Heartbroken.
— Siddharth (@Actor_Siddharth) October 29, 2021
Heartbroken 💔
Will always miss you my brother. #PuneethRajkumar
— sonu sood (@SonuSood) October 29, 2021
High alert declared in Karnataka
BREAKING :
High alert declared in #Karnataka . Police battalions deployed. Govt ordered to close theatres immediately. #PuneethRajKumar #Bangalore
— T2BLive.COM (@T2BLive) October 29, 2021
పునీత్‌ని అభిమానులు ఎంతో ప్రేమగా అప్పూ అని పిలుచుకుంటారు. లెజెండరీ నటుడు కంఠీరవ రాజ్‌కుమార్ మూడవ కొడుకే పునీత్ రాజ్‌కుమార్. 1976లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన పునీత్... 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. 1985లో విడుదలైన 'బెట్టాడ హోవు' చిత్రంతో బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు పునీత్ రాజ్ కుమార్. షెర్లీ ఎల్ అరోరా రాసిన 'వాట్ దెన్, రామన్?' నవల ఆధారంగా తెరకెక్కిన Bettada hoovu చిత్రానికి ఎల్ ఎల్ లక్ష్మీ నారాయణ్ దర్శకత్వం వహించారు. రాము అనే ఓ పూర్ బాయ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. రాము పాత్రలో పునీత్ అద్భుత నటన కనబరిచారు.
కన్నడ పవర్‌స్టార్‌గా పేరుతెచ్చుకున్న ఆయన 1975మార్చి 17న జన్మించారు. నటుడిగానే కాదు ప్లేబ్యాక్ సింగర్‌గా, టెలివిజన్ ప్రజెంటర్‌గా ఉన్నారు 1976లో `ప్రేమదా కనికే` చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు. దాదాపు పదమూడు సినిమాల్లో బాలనటుడిగా మెప్పించారు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన.. హీరోగా ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించారు. `ఇడియట్` చిత్రానికి అప్పు రీమేక్. పూరీ దర్శకత్వం వహించడం విశేషం.
హీరోగా దాదాపు 29 సినిమాల్లో నటించారు. `అభి`, `వీర కన్నడిగ`, `మౌర్య`, `ఆకాష్`, `నమ్మ బసవ`, `అజయ్`, `అరసు`, `మిలన`, `బిందాస్`, `రాజ్`, `పృథ్వీ`, `జాకీ`, `హంగామా`, `అన్న బాండ్`, `పవర్`, `రానా విక్రమ`, `చక్రవ్యూహ`,`దొడ్మనె హగ్డ్`, `రాజకుమార`, `అంజని పుత్ర` చిత్రాలతో పవర్ స్టార్‌గా ఎదిగారు. `చివరిగా ఆయన `యువరత్న` చిత్రంలో నటించారు. ఇది మంచి విజయం సాధించింది. ప్రస్తుతం `జేమ్స్`, `ద్విత్వ` చిత్రాల్లో నటిస్తున్నారు. పునీత్ రాజ్‌కుమార్ మరణంతో కన్నడ నాట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సినీ ప్రముఖులు తీవ్ర విషాదాన్ని తెలియజేస్తున్నారు.