 
                                                                 Lawrence Extends Financial Support to VA Durai: కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. అలా తాజాగా ఆయన పేదరికంలో వైద్య ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్న నిర్మాతకు ఆర్థిక సాయం చేశారు.
కాగా ప్రముఖ తమిళ నిర్మాత VA దురై ఇటీవల ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. అలాగే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ చైన్నెలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య ఖర్చుల కోసం డబ్బు అవసరం. అతను తన ఆర్థిక స్థితిని వివరిస్తూ, తన చికిత్స కోసం డబ్బును కోరుతూ గత నెలలో ఒక వీడియోను విడుదల చేశాడు. ఇప్పుడు అతడికి రాఘవ లారెన్స్ ఆర్థిక సాయం చేశారు.
విడాకుల సంగతి పక్కకు, హాట్ ఫోటోలతో యువత మతి పోగొడుతున్న నిహారిక కొణిదెల, ఫోటోలు నెట్టింట వైరల్
తొంభైల చివరలో.. 2000ల ప్రారంభంలో దురై ప్రముఖ నిర్మాతలలో ఒకరు. భారీ నష్టాలను చవిచూసిన తరువాత, అతని కుటుంబం అతనిని వదులుకుంది. ఇప్పుడు అతని పాత పరిశ్రమ స్నేహితులు అతనికి సహాయం చేస్తున్నారు. బాబా, లూటీ, ఎన్నామా కన్ను, గజేంద్ర, పితామగన్ వంటి అనేక హిట్ చిత్రాలను ఆయన తన ప్రొడక్షన్ బ్యానర్ ఎవర్‌గ్రీన్ మూవీ ఇంటర్నేషనల్‌పై నిర్మించారు.
'పితామగన్' స్టార్ సూర్య వెంటనే రెండు లక్షల రూపాయల సహాయం అందించారు, దీని తర్వాత 'బాబా' స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్ ముందుకు వచ్చి దురై వైద్య ఖర్చులు చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా రాఘవ లారెన్స్ ప్రముఖ నిర్మాత చికిత్స కోసం రూ.3 లక్షలు చెల్లించాడు. సంక్షేమ కార్యక్రమాల్లో లారెన్స్‌కు మంచి పేరుంది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
