Upasana Kamineni Konidela with Ram Charan (Photo Credits: Instagram)

టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్‌ (Ram Charan) తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఉపాసన (Ram Charan Wife Upasana) బిడ్డను ఎక్కడ జన్మనివ్వబోతుందనంటూ అనేక వార్తలు హల్ చల్ (Delivery Rumours) చేస్తున్నాయి. ఈ వార్తలన్నింటికీ ఉపాసన ఒక్క ట్వీట్ తో చెక్ పెట్టేసింది. ఇండియాలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు ట్వీట్ చేసింది. రామ్ చరణ్ ఆస్కార్ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ అమెకన్ టాక్ షో ‘గుడ్‌ మార్నింగ్‌ అమెరికా’ లో పాల్గొన్నారు. ఈ కార్యకమ్రంలో మెడికల్‌ కరెస్పాండెంట్‌, గైనకాలజిస్ట్‌ జెన్నిఫర్‌ ఆస్టన్‌ కూడా సందడి చేశారు. చరణ్‌ వ్యక్తిగత విషయాల గురించి చర్చించారు.

ఆస్కార్ స్టేజి మీద నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫామెన్స్, RRR మూవీకి మరో అరుదైన గౌరవం

ఈ సందర్భంగా.. ఉపాసన కొద్ది రోజులపాటు అమెరికాలో ఉంటుంది. ఆ సమయంలో మీరు అందుబాటులో ఉంటే బాగుంటుంది’ అని చరణ్‌ తన కోరికను తెలిపారు. అందుకు జెన్నిఫర్‌ సానుకూలంగా స్పందించారు. ‘‘చరణ్‌, ఉపాసనల ఫస్ట్‌ బేబీని డెలివరీ చేయడం నాకు గౌరవం. అందుకోసం ఎక్కడ అందుబాటులో ఉండమన్నా సిద్ధం’’ అని జెన్నిఫర్ చెప్పారు.

Here's Upasana Tweet

దీంతో ఉపాసన డెలివరీ అమెరికాలో జరగుతుందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ రూమర్స్ అన్నింటికి చెక్ పెడుతూ ఉపాసన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘డాక్టర్‌ జెన్నిఫర్‌ ఆస్టన్‌ మీరు చాలా స్వీట్‌. మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. దయచేసి మా అపోలో హాస్పిటల్స్‌ కుటుంబంలో మీరు భాగమవ్వండి. వైద్యులు సుమన మనోహర్‌, రూమా సిన్హాతో కలిసి మా బేబీని డెలివరీ చేయండి’’ అంటూ ఉపాసన ఓ ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ వైరల్‌గా మారింది