గతేడాది తెలంగాణ రాష్ట్రంలో సంచలన సృష్టించిన దిశ ఘటన ఆధారంగా ఓ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం రిలీజ్ అయిన ‘దిశ ఎన్‌కౌంటర్’ ట్రైలర్ (Disha Encounter Official Trailer) నాటి ఘటనను కళ్లకు కడుతుంది. దర్శకుడు రాం గోపాల్ వర్మ తన ట్విటర్ ద్వారా ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులు హైదరాబాద్ నగర పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఈ ఘటన ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) రూపొందిస్తోన్న సినిమా 'దిశ.. ఎన్‌కౌంటర్' నుంచి ట్రైలర్ విడుదలైంది.
దిశను నలుగురు యువకులు ఎత్తుకెళ్లడం, అత్యాచారం చేయడం, ఆపై లారీలో తీసుకెళ్లి, ఓ వంతెన కింద పెట్రోల్ పోసి తగులబెట్టడం వంటి ఘటనలకు సంబంధించిన అంశాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. ఆపై విచారణ నిమిత్తం పోలీసులు రావడం వరకు వర్మ ఈ ట్రైలర్‌లో చూపించారు. ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. 'దిశ' ఘటన జరిగిన నవంబర్ 26 తేదీనే ఈ సినిమాను విడుదల చేస్తానని వర్మ ఇప్పటికే తెలిపారు.
Disha Encounter Official Trailer
Here is the trailer of DISHA ENCOUNTER based on the 2019 horrific gang rape, killing and burning of a young woman in Hyderabad #DishaEncounter @anuragkancharla @karuna_Natti https://t.co/eEdoCf1Yhl
— Ram Gopal Varma (@RGVzoomin) September 26, 2020
కాగా, హైదరాబాద్ నగరానికి చెందిన ఓ పశువైద్యురాలిని నలుగురు కామాంధులు దారుణంగా అత్యాచారం (Disha Encounter) జరిపి, హత్య చేసిన విషయం తెల్సిందే. ఇది దేశంలో పెను సంచలనమైంది. ఈ ఘటన తర్వాత అత్యాచారాలకు పాల్పడేవారి కోసం దిశ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో కఠిన చట్టాలు వచ్చాయి. ముఖ్యంగా, ఏపీలో దిశ పేరుతో పోలీస్ స్టేషన్లు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఉదయం 9:08 గంటలకు విడుదలైన ఈ ట్రైలర్‌ని ఇప్పటికే 20 వేల మందికి పైగా చూశారు.
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఎన్నో బయోపిక్స్‌ను తెరకెక్కించి సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తన బయోపిక్‌ను (Ram Gopal Varma Biopic) తెరమీద చూపించడానికి శ్రీకారం చుట్టారు. రామ్‌గోపాల్ వర్మ జీవితాన్ని మొత్తం మూడు భాగాలుగా సినిమా తీయనున్నారు. మూడు పార్ట్‌లలో ముగ్గురు వేరువేరు వ్యక్తులు రామ్‌గోపాల్‌వర్మ స్థానంలో కనిపించనున్నారు. అయితే మూడో పార్ట్‌లో మాత్రం రామ్ గోపాల్ వర్మే నటించనున్నారు.
Ram Gopal Varma Bio Pic
DORASAI TEJA apart from acting as me in my college days is also directing the film..He is just 20 years old #RgvBiopic pic.twitter.com/LVxpDBrfcw
— Ram Gopal Varma (@RGVzoomin) September 16, 2020
My sister Vijaya gave clap today for the first shot of my biopic part 1 titled RAMU ..Produced by BOMMAKU MURALI and directed by DORASAI TEJA #RgvBiopic pic.twitter.com/mBbDH7BA0C
— Ram Gopal Varma (@RGVzoomin) September 16, 2020
ఇందుకు సంబంధించిన మొదటి పార్ట్ షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. దీనికి ‘రాము’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో దొరసాయి తేజ అనే అతను నటిస్తున్నాడు. ఫస్ట్ షాట్‌కు రామ్ గోపాల్ వర్మ సోదరి క్లాప్ కొట్టిందని వర్మ ట్విట్టర్ ద్వారా ఆ ఫోటోలను పంచుకున్నారు. అదే విధంగా తేజ తన తల్లి వద్ద ఆశీర్వాదాలు తీసుకున్నాడని వర్మ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు. తేజకు కేవలం 20 ఏళ్లు మాత్రమేనని వర్మ తెలిపారు. వర్మ బయోపిక్‌ను బొమ్మా మురళి నిర్మిస్తుండగా, వర్మ పర్యవేక్షణలో దొరసాయి తేజ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పార్ట్ 1లో రామ్ గోపాల్ కాలేజ్ డేస్ చూపించనున్నారు.